తేదీ 30.10.2021 నాడు బద్దిపడగ శివారులోని నాయిని సుధాకర్ రెడ్డి గారి మామిడి తోట పక్కన గల బండ్ల బాటా పై తంగళ్ళపల్లి గ్రామానికి చెందిన పైడి రాజశేకర్ , S / O . నారాయణ , వ ,, 26 సం . కులం : చాకలి , అనే వ్యక్తిని ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినారని , ఫిర్యాదు చేయగా ఇట్టి విషయమై పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించనైనది . కేసు యొక్క పరిశోదనలో భాగంగా తెలిసినది ఏమనగా , హుస్నాబాద్ పట్టణానికి చెందిన గుర్రాల హరీష్ రెడ్డి , తన గ్రామానికి చెందిన ఒక యువతి ఇరువురు గత 4 సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నారు అది తెలిసిన హరీష్ రెడ్డి తల్లిదండ్రులు వారి ఇద్దరి కులాలు వేరు వేరు అయినందున అతనిని మందలించి వారి ప్రేమను అంగీకరించలేదు . దానికి అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకొను అంటున్నావు కాబట్టి , మా ఇంట్లో వేరే సంబందాలు చూస్తున్నారు . నేను వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటా అని అనగా హరీష్ కి ఇస్తాం లేకపోయిన చేసుకో అని ఆమెకి చెప్పినాడు . అప్పుడు యువతి వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టి కోహెడ మండలం , తంగెళ్ళపల్లి గ్రామానికి చెందిన పైడి రాజశేఖర్ తం . నారాయణ , వృత్తి డ్రైవర్ తో ఆమె యొక్క పెళ్లిని కుదిర్చినారు . తాను ప్రేమించిన అమ్మాయిని ఎవరో పెళ్లి చేసుకోబోతున్నారని కోపంతో రగిలిపోయిన హరీష్ రెడ్డి , తనకు ఆమె దక్కదేమోనని ఉద్దేశంతో ఆమెను పెళ్లి చేసుకోబోయేవాడిని చంపాలని నిర్ణయించుకొని తేదీ : 29.10.2021 నాడు హరీష్ రెడ్డి తన స్నేహితుడైన సింగసారం నాగరాజు తో కలిసి రాజశేఖర్ ను హైదరాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లాల్సి ఉన్నది కిరాయికి రమ్మని కిరాయి ఎంతైనా పర్వా లేదని చెప్పి పథకం వేసుకొని , అతనితో కిరాయికి రావడానికి ఒప్పందం కుదుర్చుకొన్నారు . ఆ రోజు సాయంత్రం రాజశేఖర్ అతని TAVERA No. AP 35 N 2301 గల వాహనాన్ని తీసుకొని వెళ్ళినాడు , ముందుగా వేసుకొన్న పథకం ప్రకారం హరీష్ రెడ్డి , నాగరాజు లు హుస్నాబాద్ లో రెండు చాకులను మరియు హుస్నాబాద్ లో గల సిద్ధేశ్వర మెడికల్ షాప్ కి వెళ్ళి 2 జతల hand gloves మరియు 2 సర్గికల్ మాస్క్ లను కొనుక్కుని , చేరొక చాకులను వారి వద్ద ఉంచుకొని హరీష్ రెడ్డి యొక్క పల్సర్ బైక్ పై బయలుదేరి మార్గమద్యములో వారి చేతులకు గ్లాస్ లు వేసుకొని సిద్దముగ ఉండి రాజశేఖర్ వారిని కలిసినంక , హరీష్ రెడ్డి తన పల్సర్ బైక్ ను ఆరేపల్లి లోని అతని స్నేహితుడు దోనే రాకేశ్ ఇంటివద్ద పార్క్ చేసి రాజశేఖర్ యొక్క టవెరా వాహనములో హరీష్ రెడ్డి , నాగరాజు లు ఎక్కి మరి కొంత మంది బడ్డిపడగలో ఎక్కుతారని తెలుపగ రాజశేఖర్ తన వాహనాన్ని బడ్డిపడగ వైపుకు తీసుకువెళ్ళినాడు . బద్దిపడగ వరకు తీసుకవెల్లి అక్కడ ఎవరు లేనందున వారిద్దరిని ఎయిర్ పోర్ట్ లో దింపమని చెప్పినారు . అలా రంగదాంపల్లి X రోడ్డు వరకు వెళ్ళగానే ఇంకా ముందుకు వెళ్ళితే అతన్ని చంపడానికి వీలు కాదని , వారోతో ఎయిర్ పోర్ట్ కి వస్తాం అన్న వాళ్లు బద్దిపడగ వద్దకు రమ్మని ఫోన్ చేశారని , బండి వెనక్కి తిప్పమని చెప్పినారు . బద్దిపడగ వెళ్లినాక అక్కడికి ఎవరు రాలేదని హరీష్ రెడ్డి , నాగరాజు లు రాజశేఖర్ తో అనుకొన్న ప్రోగ్రాం కాన్సెల్ అయింది అని తెలిపి వారిని ఆరేపల్లి దగ్గర దింపి వెళ్ళమని రాజశేఖర్ తో చెప్పినారు . వారు ముందుగా వేసుకొన్న పథకం ప్రకారం అక్కడనుండి బద్దిపడగ దాటినాకా కొంత దూరం ఎవరు లేని ప్రదేశానికి తీసుకు వెళ్ళి రాజశేఖర్ ని చంపాలని అనుకోని బద్దిపడగ గ్రామ శివారులోని నాయిని సుధాకర్ రెడ్డి పోలానికి వెళ్ళే బండ్ల బాట వద్దకు రాగానే రాజశేఖర్ ను చంపాలనే ఉద్దేశ్యముతో హరీష్ , నాగరాజులు మూత్రం వస్తున్నదని బండి ఆపమని రాజశేఖర్ కు చెప్పినారు . హరీష్ రెడ్డి మరియు నాగరాజు వెహికల్ దిగి , పక్కకు వెళ్ళి మూత్రం పోస్తున్నట్టుగా పక్కకు నిలబడి రాజశేఖర్ ని నాగరాజు రాజశేఖర్ యొక్క వెనక సీట్లో ఉండి గట్టిగా పట్టుకుంటే , హరీష్ రెడ్డి బయట నుండి డ్రైవరు కుడి వైపు కి నుండి వెళ్ళి రాజశేఖర్ ను హతమార్చాలని నిర్ణయించుకొని , వారి పథకం ప్రకారం నాగరాజు వెళ్ళి రాజశేఖర్ వెనకాల కుర్చీలో కూర్చోని అతన్ని గట్టిగా పట్టుకొనగా , హరీష్ కుడివైపు నుండి డ్రైవరు సీటు పక్కకు వెళ్ళి అతని వద్ద ఉన్నటువంటి కత్తితో విచక్షణరహితంగా రాజశేఖర్ యొక్క ఛాతీ పై , గొంతులో ఇష్టం వచ్చినట్లుగా కత్తితో దాడి చేయగా రాజశేఖర్ ఎడమపక్క సీటులో నుండి బయటకు వచ్చి పారిపోయే ప్రయత్నం చేయగా , హరీష్ రెడ్డి మరియు నాగరాజు లు బయట రాజశేఖర్ ను పట్టుకొని చాకులతో దాడి చేసి హతమార్చి , అక్కడ నుండి కొద్ది దూరం వెళ్ళి వారి ఫ్రెండ్ అయిన ఇల్లందుల శివకు ఫోన్ చేయగా అతను గ్లామర్ బైక్ పై వచ్చి హరీష్ రెడ్డి మరియు నాగరాజు లను బైక్ పై కూర్చొబెట్టుకొని వెళ్తూ బస్వాపూర్ వాగు వద్ద చంపడానికి ఉపయోగించిన రెండు చాకులు గ్లోస్ , ఫేస్ మాస్క్ మరియు రాజశేఖర్ సెల్ ఫోన్ , పర్స్ అన్నీ వాగులో పడవేసి శివ ఇంటివద్దకు వెళ్ళి స్నానం చేసి శివ యొక్క బట్టలు వేసుకొని హరీష్ రెడ్డి అతని బట్టలను శివాజినగర్ బురుజు దగ్గర గోడ పక్కన మరియు నాగరాజు తన బట్టలను శివాలయం వీధి లోని ఒక మోరిలో పడేసినారు . తరువాత వారి గురించి పోలీసు వారు వెతుకుతున్నారని తెలిసి ఆ రోజు ఆ ముగ్గురు పోలీసు వారికి దొరకకుండా ఉందామని అనుకోని హుస్నాబాద్ చుట్టూ పక్కల తప్పించుకొని తిరుగుతు ఈ రోజు అనగా తేదీ 09.011.2021 తెల్లవారు జామునా వారు ముగ్గురు ఇల్లందుల శివ ఇంటికి వచ్చి ఉండగా అక్కడ వారు ఉన్నారన్న విషయం తెలుసుకున్న సిద్దిపేట రూరల్ CI సురేందర్ రెడ్డి , మరియు రాజగోపాలపేట SI D. మహిపాల్ రెడ్డి , ప్రవీణ్ PSI , తేజస్విని WPSI , రాజగోపాలపేట SHO గారైన A. గణేశ్ గౌడ్ మరియు సిబ్బంది కలిసి వారిని పట్టుకొని , హత్య చేయడానికి వారు ఉపయోగించిన రెండు కత్తులు మరియు మృతుడి యొక సెల్ ఫోన్ లను వారు చూపించిన ప్రదేశం నుండి స్వదీన పర్చుకొనైనది . తదుపరి 1. గుర్రాల హరీష్ రెడ్డి , 2. సింగసారామ్ నాగరాజు మరియు 3. ఇల్లందుల శివ లను అరెస్ట్ చేయనైనది . ఇట్టి హత్య కేసు ఛేదించడానికి సహకరించిన రాజగోపాలపేట SI D. మహిపాల్ రెడ్డి , ప్రవీణ్ PSI , తేజస్విని WPSI , రాజగోపాలపేట SHO A. గణేశ్ గౌడ్ మరియు సిబ్బంది HC మక్సూద్ అలీ , PC నవీన్ , CI గన్ మ్యాన్ నర్సిములు PC , రాజగోపాలపేట PC లు నర్సిములు , రాజు , వెంకట్ , స్వామి , నాగరాజు , రమేష్ లు రెండు బృందాలుగా విడిపోయి నిందితులను పట్టుకోవడములో కష్టపడి పని చేసినందుకు వారిని అభినందించడమైనది మరియు వారికి రివార్డ్స్ గురించి ప్రపోసల్ పంపబడును.
హత్య కేసులో నిందితుల అరెస్ట్
November 09, 2021
0
Tags
