*జిల్లాకు 7 కొత్త మద్యం షాపులు మంజూరు*...
1.ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి-1
2.గంభీరావుపేట మండలం-1
3.కోనరావుపేట మండలం నిమ్మపెల్లి -1
4.సిరిసిల్ల పట్టణం-2
5.తంగళ్ళపల్లి మండలం సారంపల్లి-1
6.వేములవాడ పట్టణం-1.
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం. జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎక్సైజ్ శాఖ అధికారి చంద్రశేఖర్ మాట్లాడుతూ...
▪️ ఈ రోజు నుండి జిల్లాలోని 48 మద్యం షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నాం.
▪️ దరఖాస్తుదారులు 5 కలర్ ఫోటోలతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ కాఫీ, పాన్ కార్డు జిరాక్స్ కాపీ, కులం సర్టిఫికెట్ లతో పాటు DIST.PROHIBITION AND EXCISE OFFICER, RAJANNA SIRICILLA. పేరిట రెండు లక్షల రూపాయల డీడీ లేదా చలాన్ ను జత పరచాలి.
▪️ దరఖాస్తుదారులు దరఖాస్తులను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని మొదటి ఫ్లోర్ రూమ్ నెంబర్ F-25 సమర్పించాలి.
▪️ దరఖాస్తులు స్వీకరించే సమయం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. (ఆదివారం సెలవు)
▪️ దరఖాస్తులు స్వీకరించు చివరితేదీ ఈ నెల 18-11-2021 వరకు.
▪️ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో దరఖాస్తులు డ్రా నిర్వహించు తేదీ 20-11-2021.
