*ఇసుక అక్రమా రవాణాకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోండి*
----- *మైనింగ్ ఎడి కి వినతిపత్రం అందజేత*
ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గనులు మరియు భూగర్భ శాఖ కార్యాలయంలో మైనింగ్ ఎ.డి గారిని కలిసి వేగురుపల్లి మానేరు వాగు లో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా *బిజెపి మండల అధ్యక్షులు రాపాక ప్రవీణ్ మాట్లాడుతూ*.... మానకొండూర్ మండలంలోని వేగురుపల్లి మానేరు వాగులో అనుమతులకు మించి ఇసుక లారీలు నడిపిస్తున్నారు, టిఆర్ఎస్ పెద్ద నాయకుల ప్రోద్బలంతో ఇసుక లారీలు ఓవర్ లోడ్ తో నడిపిస్తున్నారు. ఒకే వేబిల్లుపై ఇష్టానుసారంగా, విచ్చలవిడిగా అక్రమ రవాణా నిర్వహిస్తున్నారు. ఈ ఓవర్ లోడ్ కారణంగా రోడ్డు దెబ్బతిని ప్రయాణికులకు ప్రమాదాలు జరుగుతున్నవి, రోడ్డు ప్రక్కన ఉన్న కుటుంబాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రజలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. నిబంధనలకు విరుద్దంగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని లేదంటే రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యమాలు చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కాల్వ చిరంజీవి, కరీంనగర్ ఈస్ట్ జోన్ కిసాన్ మోర్చా అధ్యక్షులు మాచర్ల కోటేశ్వర్,బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు మర్రి అంజి నాయకులు సింగిరెడ్డి అనిల్ రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.
