మానకొండూర్లో టీఆర్ఎస్ పార్టీ భారీ రైతు ధర్నా..
- యాసంగి వరి పంటను కేంద్రం కొనుగోలు చేయాలి
- గౌరవ మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి డిమాండ్
.
- తెలంగాణా రైతులు పండించిన యాసంగి వరి పంటను వెంటనే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గౌరవ సీఎం కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు
రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ గారి సారధ్యంలో ఈరోజు మానకొండూర్లో భారీ రైతు ధర్నా జరిగింది.
- మానకొండూర్ నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన ఈ ధర్నాలో అన్ని గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్న వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు..
