రైతులు తలుచుకుంటే ఏం చేయగలరు అనే దానికి నిదర్శనమే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చట్టాలను రద్దు చేయడం. - డా.కవ్వంపల్లి సత్యనారాయణ
*కల్లాల్లోకి కాంగ్రెస్* అనే నినాదంతో.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రైతులకు మద్దతుగా కాంగ్రెస్ నాయకులు, కల్లాల్లోకి వెళ్లి ధాన్యాన్ని పరిశీలించి రైతుల సమస్యలను తెలుసుకోవాలని నేడు టిపిసిసి ఇచ్చిన పిలుపు మేరకు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు, స్థానిక నాయకులతో కలిసి మానకొండూర్ నియోజకవర్గంలోని తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రం మరియు శంకరపట్నం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఆర పోసిన ధాన్యాన్ని పరిశీలించి, రైతుల సమస్యలను తెలుసుకోవడం జరిగింది,
👉ఈ సందర్భంగా కవ్వంపల్లి సత్యనారాయణ గారు మాట్లాడుతూ..ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నల్ల చట్టాలను రద్దు చేయాలని, రైతులను చిన్నచూపు చూడవద్దని, కొనుగోలు కేంద్రాలను ఎత్తి వేయవద్దని, కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాయవద్దని, కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కొన్ని నెలల నుండి దేశ వ్యాప్తంగా రైతులు చేస్తున్న ఉద్యమాల పట్ల ఇన్ని రోజులకు ప్రధాని నరేంద్ర మోడీ కి కనువిప్పు కలిగి, నేడు నల్ల చట్టాలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతుల పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నాం.
👉రైతు ఉద్యమం ప్రారంభమైన నాటి నుండి కేంద్రంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీమతి ప్రియాంక గాంధీ గారు మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సుదీర్ఘ పోరాటం ఫలితంగా నేడు కేంద్ర ప్రభుత్వం ఈ నల్ల చట్టాలను రద్దు చేసుకుంది.
👉కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు ఈ ఏడాది జనవరి 14న మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. రైతుల ఒత్తిడితో వారు చేస్తున్న ఉద్యమానికి తలవంచి ఏనాటికైనా బిజెపి ప్రభుత్వం 3 నల్ల చట్టాలను రద్దు చేసుకుంటుందని.. నా మాటలు గుర్తు పెట్టుకోవాలని ప్రకటించిన విషయాన్ని ఈ దేశ ప్రజలు మరవలేదని,
బిజెపి ప్రభుత్వం ఎన్నోసార్లు రైతు ఉద్యమాన్ని అనిచివేయాలని ప్రయత్నించింది, ఎర్ర కోట సాక్షిగా రైతుల పై దాడులకు పాల్పడిన విషయాన్ని గుర్తుచేశారు.
👉ఇటీవల ఇదే నల్ల చట్టాలను రద్దు చేయాలని పంజాబ్ రాష్ట్రంలో శాంతియుత ర్యాలీ చేపడుతున్న రైతులపై, బిజెపి పార్టీకి చెందిన కేంద్ర మంత్రి కుమారుడు నిర్ధాక్షిణ్యంగా కారు ఎక్కించి ఎనిమిది మంది రైతుల ప్రాణాలు తీస్తే కనీసం ఆ రైతు కుటుంబాలను కూడా పరామార్శించని ప్రధాని నరేంద్ర మోడీ మరియు బిజెపి ప్రభుత్వం నల్ల చట్టాలను రద్దు చేసి రైతుల పట్ల మొసలి కన్నీరు కరుస్తుందని, ఇక జీవితంలో ఏనాడు ఈ దేశ ప్రజలు, రైతులు బిజెపి ప్రభుత్వాన్ని నమ్మలేరని, బిజెపికి భవిష్యత్ గడ్డుకాలమే అని, రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని అన్నారు.
