జిల్లా
ఈరోజు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారు గెలవడంతో బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు కోడి.రమేష్ గారి ఆధ్వర్యంలో పట్టణ బీజేపీ కార్యాలయం నుంచి విజయోత్సవ ర్యాలీగా బయలుదేరి స్థానిక పాత బస్టాండ్ లో గల తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, బాణసంచాలు పేల్చి స్వీట్లు పంచి,అనంతరం కాంట చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లడం జరిగింది. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి మునిమంద రమేష్ గారికి స్వీట్లు తినిపించి,ఇంటి వద్ద బాణసంచా లు పేల్చడం జరిగింది అనంతరం పట్టణ అధ్యక్షులు కోడి రమేష్ గారు మాట్లాడుతు తెలంగాణ లో హుజురాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ గెలుపుతో దీపావళి రెండురోజుల ముందేవిచ్ఛే సింది ఆత్మగౌరవనికి - అహంకారనికి జరిగిన పోటీలో ఆత్మగౌరవనికె ప్రజలు పట్టంకట్టారు. అధర్మాంగా హుజురాబాద్ ఎన్నికల్లో TRS ప్రభుత్వం గెలవాలని చూస్తే ప్రజలు ధర్మం వైపున నిలబడి బీజేపీ ని గెలిపించారు. కులాలను,మత లను,ప్రాంతాలను,SC, BC, మైనార్టీలు అని వేరుచేసి
పిట్టలదొర వేషాలు వేసిన ప్రజలు నమ్మలేదు బీజేపీకి పట్టం కట్టారు. రాబోయే భవిష్యత్ ఎన్నికల్లో TRS దొరగారి కుటుంబ పాలనను చరమగీతం పడడం ఖాయమని ప్రజలు నిక్కర్సు సమాధానం చెప్పారు ఇక రబోయేది రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమె అని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ కమిటీ సభ్యులు, జిల్లా నాయకులు, వివిధ మోర్చల నాయకులు, సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
.