లంచం తీసుకొంటూ దొరికిన. ఎఎఈ
పెద్దపల్లి జిల్లా మంథని మండలం బిట్టుపల్లి సబ్ స్టేషన్లో లో శనివారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఎన్ పీడీసీఎల్ ఏఏఈ రాజ్ కుమార్ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హైండెడ్గా పట్టుకున్నారు. బాధితుడు, నిందితుల నుండి వాంగ్మూలాలు సేకరించే పనిలో ఏసీబీ అధికారుల బృందం నిమగ్నమైంది. ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య నేతృత్వంలో జరుగుతున్న ఈ దాడుల్లో సీఐ ఎస్పీ రవీందర్ తో పాటు పలువురు ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.