టి.ఆర్.ఎస్,బిజేపి లుఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుంటు కాలయాపన చేస్తూ రైతులను విస్మరిస్తున్నారు_*~ *_కాంగ్రెస్ నియెాజక వర్గ యువనేత &బి.సి.సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్_
ఈ రోజు సిద్దిపెట్ జిల్లా హుస్నాబాద్ నియెాజక వర్గం కోహెడ మండలం కేంద్రంలో కాంగ్రెస్ నియెాజక వర్గ యువనేత &బి.సి.సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ
వడ్ల కొనుగోలు చేయకుండా అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనాయకులు ధర్నాలు,రాస్తారోకోలు చేయడం సిగ్గుమాలిన చర్య అన్నారు.
వడ్ల కొనుగోలు పై TRS,బీజేపీ లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కాలయాపన చేస్తూ రైతులను విస్మరిస్తున్నారని తప్పుబట్టారు.స్థానిక మంత్రి తన్నీరు హరీష్ రావు గారు ఇప్పటికైన రైతుల బాధలు,వారి కష్టాలు గుర్తించి వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని,తాలు,తప్ప పేరుతో వడ్లు కటింగ్ చేయకుండా మద్దతు ధరతో వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ మరియు బి.సి.సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపపడుతామని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో బి.సి.సంక్షేమ సంఘం గ్రామ శాఖ గౌరవ అద్యక్షుడు మహెందర్ సింగ్ అద్యక్షుడు సింగిరాల శ్రీనివాస్ కార్యదర్శి సింగిరాల కూమార్ యూత్ అద్యక్షుడు జగదీశ్వరా చారి జడగల పవన్ బోడిగే శ్రీనివాస్ రాజు తదితరులు పాల్గొన్నారు.
