NEWSPOWER REPORTER:Sairam
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బాయిజమ్మ సాయి సేవాట్రస్ట్ వ్యవస్థాపకులు బెల్లంపల్లి వాస్తవ్యులు శ్రీమతి శ్రీ కాంపల్లి రాజేశ్వరి శంకర్ గార్లు కార్తీక మాసం పురస్కరించుకొని శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న సందర్బంగా యాచకులకు, మానసిక వికలాంగులకు,అనాధలకు, పేదవారికి అన్నప్రసాద వితరణ చేయడం జరిగిందని తెలిపారు బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా ప్రతి రోజు అన్నదానం ఇంకా మరేన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందనీ తెలియజేశారు అన్నప్రసాద వితరణ చేసినందుకు బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు కాంపల్లి రాజేశ్వరి శంకర్ గారికి సేవా ట్రస్ట్ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేయడం జరిగినది.ఆకలితో ఉన్నవారిని అతిధి సత్కారంతో ఆదరిద్దాంఅన్నదానంతో తృప్తి పరుద్దాం అని వ్యవస్థాపకులు పిలుపునిచ్చారు,