బిక్క వాగు బ్రిడ్జి పై నిరసన

బిక్క వాగు బ్రిడ్జి పై నిరసన

 న్యూస్ పవర్ , 8 మార్చి , ఇల్లంతకుంట :
బిక్క వాగు బ్రిడ్జి పై   అనంతారం గ్రామ యువజన సంఘం సభ్యులు నిరసన వ్యక్తం చేశారు 
బిక్క వాగు పై బ్రిడ్జి నిర్మాణం 2016- 2017 సంవత్సరం లో ప్రారంభించారు ఇప్పటి వరకు కూడా పూర్తి చెయ్యలేదు అని యువజన సంఘం సభ్యుడు అక్కేం నాగరాజు అన్నారు ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ గత ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభిచి పనులను అరకొర గా నిర్మాణం చేసింది అని ఆ నిర్మాణం పూర్తి చెయ్యాలి అని అప్పుడున్న ప్రభుత్వాన్ని ఎన్నో సార్లు హెచ్చరించాము అని అయిన కూడా పనులు పూర్తి చెయ్యలేదు అని నిర్మాణం పూర్తి కాక ఇల్లంతకుంట మండల కేంద్రం నుండి జిల్లాల్ల కి వెళ్లే ప్రధాన రోడ్డు అని నిత్యం వందలాది వాహనాలు ఈ బ్రిడ్జి పై నుండి వెళ్తాయని ఎవరైనా బ్రిడ్జి పై పడి చనిపోయే అవకాశం ఉంది అని ఎలాంటి ప్రమాదాలు జరగక ముందే స్థానిక ఎమ్మెల్యే కావ్వంపల్లి గారికి గతం లోనే హెచ్చరిచాము అని అయినా కూడా ఎమ్మెల్యే గారి నుండి ఎలాంటి స్పందన లేదు అని ఇప్పటికి అయినా ఎమ్మెల్యే గారు స్పందించకపోతే తీవ్ర ఉద్యమలు చేస్తాము అని హెచ్చరించారు స్థానిక ఎస్సై శ్రీకాంత్ గౌడ్ గారి హామీ మేరకు నిరసన నీ విరమించాము అని చెప్పారు ఈ కార్యక్రమం లో వెంకటేష్, రాజు, చింటూ, భాస్కర్,అంజి,విన్ను, కిరణ్, హరి,రాకేష్, అభి, చంద్రం, మధు, నాగరాజు, నర్సయ్య, కిట్టయ్య, జయపాల్, గణేష్, రాజ్ కుమార్, బిట్టు, అరవింద్, శివ, అఖిల్, కిరణ్, ఉపేందర్, ఎల్లయ్య, మల్లేశం, రిషి,ప్రవీణ్, అశోక్, సాగర్, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments