చుట్టూ నీళ్లున్న చుక్క నీరు లేక ఎడారిగా మారుతున్న పొలాలు

చుట్టూ నీళ్లున్న చుక్క నీరు లేక ఎడారిగా మారుతున్న పొలాలు 

• మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్



 న్యూస్ పవర్ , 10 మార్చి , ఇల్లంతకుంట :
తెలంగాణ రాష్ట్రంని కోటి ఎకరాలకు సాగునీళ్లు అందించే అన్నపూర్ణ రిజర్వాయర్, మధ్యమానేరు ప్రాజెక్టులు ఇల్లంతకుంట మండలంలో ఉన్నప్పటికీ ఇక్కడి రైతులకు సాగునీళ్లు అందక కన్నీళ్లే మిగులుతున్నాయని...రైతులు అన్నమో రామచంద్రా అంటున్న ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కు కనివిప్పు కలగడం లేదని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ అన్నారు
రంగనాయక సాగర్ ఎల్ఎం6 కెనాల్ నిర్మాణం చేపట్టాలని రైతులు పెద్దలింగాపూర్ సబ్ స్టేషన్ వద్ద గత పది రోజులుగా రిలేనిరహారదీక్ష చేస్తుండగా సంఘీభావం తెలిపారు.
అనంతరం ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రసమయి బాలకిషన్ మాట్లాడుతూ చుట్టూ నీళ్లున్న ఇల్లంతకుంట మండల రైతులకు చుక్క నీరు దొరకడం లేదన్నారు.
అన్నపూర్ణ, మధ్యమానేరు, రంగనాయక సాగర్ నుంచి తెలంగాణలోని కోటి ఎకరాలకు సాగు నీరు అందిస్తున్న ఇక్కడి రైతులకు నీళ్లు కారువయ్యాయని, కిలోమీటరు దూరం కాల్వ పనుల కోసం 1.25 కోట్ల నిధులు ఆర్థిక శాఖలో క్లియరెన్స్ చేయిస్తే కాంట్రాక్టర్ కాల్వ పనులు ప్రారంభిస్తాడని...కానీ స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కు రైతు సమస్యలపై చిత్తశుద్ధి లేదన్నారు.
గత పదేళ్ల కాలంలో నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బోటిమీదపల్లె దగ్గర ఫారెస్టు క్లియరెన్స్ లేకున్నా కిలోమీటర్ దూరం పైపులైన్ నిర్మాణం చేయించామని, ఇప్పుడున్నా ఎమ్మెల్యే కాల్వ ఎందుకు తవ్వించడం లేదన్నారు.
పంటలు ఎండుతున్నా కనికరించేవారు లేరని, గత ప్రభుత్వ హయాంలో మానకొండూర్ నియోజకవర్గములోని ఇల్లంతకుంట, గన్నేరువరం, బెజ్జంకి మండలాల్లో కాల్వలు తవ్వించి లక్ష ఎకరాలకు సాగునీళ్లు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.
కాల్వ పనులు ప్రారంభించాలని పెద్దలింగాపూర్, దాచారం,రామోజీపేట,చిక్కుడువానిపల్లి, తంగళ్లపల్లి మండలంలోని వివిధ గ్రామాల రైతులు రిలేనిరహారదీక్ష చేస్తున్న ప్రభుత్వం ఎందుకు పట్టించుకోకుండా ఉందన్నారు.
ఎల్ఎం6 కెనాల్ నిర్మాణం పూర్తి చేస్తే 9500ఎకరాల భూములకు సాగునీళ్లు వస్తాయని, స్థానిక ఎమ్మెల్యేకు కాల్వ తవ్వించి రైతులకు సాగు నీళ్లు అందించేంత సమయం కూడా దొరకడం లేదాని ప్రశ్నించారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కాల్వ పనులు బంద్ అయ్యాయి...రైతుబంధు, రైతు రుణమాఫీ బంద్ అయిందని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క రైతు నీళ్లు కావాలని ధర్నా చేయలేదన్నారు.
తెలంగాణ రాష్ట్రం రాక ముందు సీమాంధ్ర పాలనలో రైతులు నీళ్ల కోసం, నిధుల కోసం, యూరియా బస్తాల కోసం ధర్నాలు చేశారు...ఇప్పుడు. మళ్లీ కాంగ్రెస్ రాగానే రైతులు నీళ్లు,కాల్వలు,యూరియా బస్తాల కోసం ధర్నాలు చేస్తున్నరని అన్నారు.
ఎల్ ఎం6కెనాల్ క్లియరెన్స్ తీసుకురావడం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కు చేతకాకుంటే నేను వెళ్లి ఆర్థికశాఖ క్లియరెన్స్ తెస్తానని సవాల్ విసిరారు.
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కు కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ కాల్వలో తవ్వించడంలో లేదని,ఎమ్మెల్యే కు రైతులను పరామర్షించే సమయం కూడా లేదాని అన్నారు.
ఇప్పటికైనా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్పందించి రైతుల సమస్యకు పరిష్కారం చూపాలని, రైతుల కన్నీళ్లు తుడవాల్సిన హక్కు ఎమ్మెల్యే కు ఉందన్నారు.
అన్నపూర్ణ రిజర్వాయర్ డెడ్ స్టోరీజీకి వచ్చిందని, బిక్కవాగు ఎండిందని ఉన్న నీళ్ళన్ని పైకి పోతే ఇక్కడి రైతుల పరిస్థితి ఎంటన్నారు. ఎమ్మెల్యే వెంటనే నీటిపారుదల అధికారులతో సమీక్ష నిర్వహించి, ఏ రిజర్వాయర్లో ఎన్ని నీళ్లున్నాయని తెలుసుకుని, మధ్యమానేరు నుంచి నీళ్లు ఎత్తిపోయించి ఇల్లంతకుంట మండల రైతులకు సాగు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మార్పు మార్పు అంటే రైతులు ఆత్మహత్యలు చేసుకోవడమా అని అన్నారు...ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ పాతాళంలో తొక్కిందన్నారు.
ఇల్లంతకుంట, గాలిపల్లి సొసైటీలో మంచిగా నడుస్తుంటే ఓర్వలేక ఎమ్మెల్యే ఇద్దరు చైర్మన్ల పదవులను తొలగించి, పర్సన్ ఇంచార్జ్ లను ఇప్పించడం ఏంటని అన్నారు. రైతులకు చైర్మన్లు సేవ చేయడం తప్పాని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం సొసైటీ చైర్మన్ల పదవి కాలం పొడగిస్తే ఎమ్మెల్యే ఊడపీకించడం ఎంటన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, సెస్ డైరెక్టర్ రవిందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ జిత్తుగౌడ్,
ఎండిసాదుల్ ,పర్శరామ్ ,దేవేందర్ రెడ్డి ,అంతగిరి భాస్కర్ ,దయ్యాల మహేష్ ,కొట్టె వెంకన్న ,దయ్యాల మధు ,కాసుపాక దుర్గయ్య ,చదువల సతీష్ ,బాలా గౌడ్ ,కాసుపాక రాములు ,గొడుగు హరికుమార్ ,
చదువల పర్శరాములు ,వొళ్ళలా పర్శరామ్,గోపాల్ రెడ్డి,కూసా నరేష్,కుమార్ యాదవ్, బొప్ప శ్రీనివాస్,భాగయ్య,నర్సయ్య,రాజు,బలరాం,దేవయ్య
తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments