• మద్యం సేవించి దుర్గా దేవి శోభాయాత్రలో పాల్గొనవద్దు • నిమజ్జనం వెళుతున్న దారిలో విద్యుత్ వైర్లు తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి • ఉత్సవాల నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు తప్పవు • దుర్గ దేవి ఉత్సవ ఆర్గనైజర్ల సమావేశంలో ఎస్సై కదిరే శ్రీకాంత్
న్యూస్ పవర్ , 2 అక్టోబర్ , ఇల్లంతకుంట : ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ ఆవరణలో లో దుర్గ దేవి ఉత్సవ కమిటీ మరియు వివిధ గ్రామాల దుర్గ దేవి ఉత్సవ ఆర్గనైజర్లతో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కదిరే శ్రీకాంత్ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా దుర్గా మాత నిమజ్జనం అయ్యేంతవరకు బాధ్యతగా వ్యవహరించాలనీ దుర్గా దేవి నిమజ్జనం వెళుతున్న దారిలో విద్యుత్ వైర్లు తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలనీ మరియు నిమజ్జనం ప్రాంతం వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ మరియు లౌడ్ స్పీకర్లకు డీజే లకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు మద్యం సేవించవద్దు తాగి దుర్గా దేవి శోభాయాత్రలో నిమజ్జనం వద్దగాని పాల్గొనరాదనీ మండలంలోని దుర్గా దేవి ఉత్సవాల నిబంధనలకు విరుద్ధంగా ఎవరు కూడా వ్యవహరించవద్దనీ ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామంలో శాంతియుతంగా నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించుకుని అధికారులకు పోలీసుశాఖ వారికి సహకరించాలనీ కోరారు.