బిక్క వాగు బ్రిడ్జిపై రైతులతో బీజేపీ నాయకుల ధర్నా
రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇల్లంతకుంట వంతడుపుల మధ్యలో గల బిక్క వాగు బ్రిడ్జిపై భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా మిడ్ మానేరు నుండి అన్నపూర్ణ ప్రాజెక్టులోకి తక్షణమే నీరు వదిలి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపెళ్లి సత్యనారాయణకి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే మిడ్ మానేరు నుండి అన్నపూర్ణ ప్రాజెక్టులోకి తక్షణమే నీరు వదలాలని కోరారు. ఎన్నో గ్రామాల రైతన్నల వందల ఎకరాలకు నీరు లేక ఎండిపోతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదన్నారు. ఆరుకాలం కష్టపడి సాగు చేసిన పంటలు ఎండిపోతుండడంతో రైతన్నలు రోడ్డుమీదకి వచ్చి తమ ఆవేదనను వెల్లబోసుకుంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా రైతులను తక్షణమే ఆదుకోవాలని లేనిపక్షంలో ఇంకా రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నుండి ఎన్నో ధర్నాలు చేస్తామని డిమాండ్ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు తిప్పారపు శ్రావణ్, వజ్జే పెళ్లి శ్రీకాంత్, బిజెపి నాయకులు దేశెట్టి శ్రీనివాస్, అమ్ముల అశోక్, శ్రీనివాస్ పున్నిరాజు రెడ్డి, సతీష్, అనిల్, రాజు, రవి, శ్రీనివాస్, శ్రీకాంత్, శ్రావణ్, అంజి, వివిధ గ్రామాల రైతన్నలు పాల్గొన్నారు.