వరి ధాన్యం కోనుగోలులో నిర్లక్ష్యం వహించరాదు. - CPI బెల్లంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ రేగుంట చంద్రశేఖర్
CPI రాష్ట్ర సమితి పిలుపు మేరకు శుక్రవారం బెల్లంపల్లి ఆర్డిఓ కార్యాలయం ముందు ధార్న నిర్వహించి ఆర్ డి ఓ కు వినతి పత్రం అందజేశారు.. అనంతరం CPI బెల్లంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ రేగుంట చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో వరి పంట వేయవద్దు అనడం అవివేకం అని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరి ధాన్యం కోనుగోలులో నిర్లక్ష్యం వహించరాదని అన్నారు.. తద్వారా రైతులను మానసికంగా ఇబ్బందులకు గురి చేయడం బాధాకరమని అన్నారు... బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనమంటున్నా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతుల చేతికొచ్చిన పంటను కొనడంలో జాప్యం చేయకూడదని అన్నారు.లేని ఏడల రాష్ట్ర వ్యాప్తం నిరసన కార్యక్రమం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో చిప్ప నర్సయ్య - సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, గుండ చంద్ర మాణిక్యం - సిపిఐ పట్టణ కార్యదర్శి, బొంతల లక్ష్మీనారాయణ - సిపిఐ పార్టీ మండల కార్యదర్శి, కోండు బానేష్ - సిపిఐ తాండూర్ మండల కార్యదర్శి, మేకల రాజేశం, అక్కేపల్లి బాపు - సిపిఐ జిల్లా సమితి సభ్యులు, రంగ ప్రశాంత్ - సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి, బెల్లంపల్లి పట్టణ కార్యవర్గ సభ్యులు : - రత్నం రాజా, ఎల్తురి శంకర్, బొంకురి రామచందర్, ముల శంకర్ గౌడ్ , లింగయ్య, మహేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.