వికలాంగుల శాఖని,శిశు సంక్షేమ శాఖలో విలీనం ప్రతి పాదనను ప్రభుత్వం విరమించుకోవాలని వినతి
వికలాంగుల-జేఏసీ జిల్లా కన్వీనర్- మరియు తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా అధ్యక్షుడు డిమాండ్..
సిద్దిపేట జిల్లా కలెక్టర్ మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది తెలంగాణ వికలాంగుల-జేఏసీ జిల్లా కన్వీనర్ మరియు సిద్దిపేట జిల్లా తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా అధ్యక్షుడు సుతారి రమేష్ మాట్లాడుతూ గత 3 దశాబ్దాలుగా దివ్వాంగుల అభ్యున్నతి కొరకు ప్రత్యేకంగా ఉన్న దివ్వాంగుల సంక్షేమ శాఖ ను పాలన సౌలభ్యం సాకుగా చెప్పి స్త్రీ. శిశు సంక్షేమ శాఖలో విలీనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాధనను మేము పూర్తిగా వ్యతిరేకంస్తూ మా అభిప్రాయన్ని తమరికి తెలియచేస్తూనాము ఈ విలీనాన్ని వ్యతిరేకంస్తూ 2016 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు అనేక విధాలుగా తమ నిరసనలు తెలిపినప్పటికి ప్రభుత్వం తన ఆలోచనను మార్చుకోక ప్రజాభిప్రాయ సేకరణ చేయడం బాధాకరం .1995 సం" జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రం లో 10.50 లక్షల మంది దివ్యాంగులు ఉండగా. వికలాంగుల హక్కుల చట్టం-2016 ప్రకారం ప్రభుత్వం 21 రకాల దివ్యాంగులను చేర్చడంతో ప్రస్తుతం దివ్యాంగుల జనాభా సుమారు 25 లక్షల ఉన్నట్లు అంచనా .కానీ జనాభా శాతంలో అధికంగా ఉన్నప్పటికీ దివ్యాంగులకు ప్రత్యేక శాఖను తొలగించి వారికి కనీస గుర్తింపు లేకుండా చేయాలని చూడటం బాధాకరం. దివ్యాంగుల సంక్షేమ శాఖను స్త్రీ శిశు సంక్షేమశాఖ తో కలపడం వల్ల దివ్యాంగుల ఆత్మగౌరవం. ఉనికి దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది.
కావున స్ర్తీ శిశు సంక్షేమ శాఖలో దివ్యాంగుల సంక్షేమ శాఖ విలీనానికి తెలంగాణ రాష్ట్ర వికలాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ తరుపున తీవ్ర అభ్యంతరములు తెలుపుతూ ఈ విలీనాన్ని పూర్తిగా నిలిపివేయాలని కోరుతున్నాము ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు జిల్లా నాయకుడు ఆరు కొండ మల్లేశం చేర్యాల మండల అధ్యక్షుడు అనిల్ చుంచనకోట గ్రామ అధ్యక్షుడు మల్లేశం పెరిక కనకయ్య బీ లక్ష్మయ్య ఎస్ కనకయ్య మద్దూర్ మండల్ అధ్యక్షుడు నర్సింలు వంగపల్లి మల్లేశం తదితరులు పాల్గొన్నారు
