మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో భగత్ సింగ్ విగ్రహం వద్ద అరుణ పతాకాన్ని ఎగురవేసిన కామ్రేడ్ చిప్ప నర్సయ్య CPI రాష్ట్ర సమితి సభ్యుడు.
ఈ సందర్భంగా చిప్ప నర్సయ్య, CPI బెల్లంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ రేగుంట చంద్రశేఖర్ మాట్లాడుతూ రష్యాలో జార్ ప్రభువుల నియంతృత్వ పరిపాలన అంతం చేయడానికి లెనిన్ నాయకత్వంలో 7 నంబర్ 1917వ తేదీన పెట్రోగ్రాడ్లో జరిగిన సాయుధ తిరుగుబాటు పోరాటంలో సోవియట్, రష్యా విముక్తి అయి, అధికారాన్ని స్వాధీనం చేసుకున్న సంఘటననే అక్టోబర్ మహా విప్లవం అని అన్నారు.లెనిన్ నాయకత్వాన జరిగిన తొలి సోషలిస్ట్ విప్లవం,
అక్టోబర్ విప్లవ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆనాటి లెనిన్ విప్లవ పోరాటాల, స్ఫూర్తి గురించి కార్మిక వర్గం, సిపిఐ, CPI పార్టీ అనుబంధా ప్రజా సంఘాల సభ్యులకు వివరించారు..ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు బొల్లం పూర్ణిమ, AITUC బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్,
CPI జిల్లా సమితి కౌన్సిల్ సభ్యుడు మేకల రాజేశం,
గుండ చంద్ర మాణిక్యం - సిపిఐ పట్టణ కార్యదర్శి, బొంతలు లక్ష్మీనారాయణ - సిపిఐ పార్టీ మండల కార్యదర్శి, మేకల రాజేశం తదితరులు పాల్గొన్నారు..