ఉచిత న్యాయ విజ్ఞాన సదస్సు కరపత్రం పంచుతూ ప్రజలకు అవగాహన కల్పించిన పారా లీగల్ వాలింటేర్ చిట్యాల సంపత్
ఈ రోజు కోహెడ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా ఆవరణలో ఉచిత న్యాయ విజ్ఞాన సదస్సు అవేర్నెస్ ప్రోగ్రాం చేయడం జరిగింది ఈ కార్యక్రమం గురించి పారా లీగల్ వాలంటీర్ చిట్యాల సంపత్ మాట్లాడుతూ గ్రామీణ ప్రజలు ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు సాధ్యమైనంతవరకు గ్రామంలోనే పరిష్కరించుకోవాలని ఆ సమస్యను గురించి పోలీస్ స్టేషన్లు కోర్టులు లను ఆశ్రయిస్తే సమయం డబ్బులు వృధా చేసుకోవడమే జరుగుతుంది కావున మన గ్రామాలలో సమస్యలు రాకుండా చూసుకో వలసినది ఒకవేళ సమస్య వస్తే ఆ సమస్యను ఎలా అధిగమించాలో తెలుసుకోవాలి అన్ని ప్రయత్నాలు చేసిన తదుపరి అప్పటికి మన సమస్య తీవ్ర పోతే మనకు ఉచిత న్యాయ సహాయం అందించడానికి న్యాయ సేవా అధికార సంస్థ పని చేయుచున్నది అని తెలిపారు అలాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు అని తెలిపారు ఈ కార్యక్రమంలో పారా లీగల్ వాలంటరీ చిట్టేల సంపత్, వేల్పుల శంకర్, దుంబాల వేణుగోపాల్, జనగాం యాదగిరి, తాడిశెట్టి నరసయ్య, ఖమ్మం రాజేశం, కొమురయ్య ,పొన్నాల చంద్రమౌళి ,సంపత్ ,రాణా సింగ్ తదితరులు పాల్గొన్నారు.
