JSON Variables

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ



• శనివారం నుండి 9 రోజులు ఒక్కో ప్రత్యేకత
• సత్తుపిండి, నువ్వులు, బెల్లం, పల్లిలతో పలహారాలు



 తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ. తెలంగాణ ప్రాంతానికి మాత్రమే సంబంధించిన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి 9 రోజులు వరుసగా జరుపుకుంటారు. పువ్వులు, నీరు, ప్రకృతి ప్రధానాంశాలుగా పండుగ సాగుతుంది. వీటి చుట్టే ఆట, మాట, పాట కలగలిపి ఉంటాయి. సంగీతం, సాహిత్యం రెండు ప్రతిబింబిస్తాయి. ఈ పండుగ సమయమంలో గ్రామంలోని చెరువులో కుంటలు జల కళతో తొనికిసలాడుతాయి. ఆజలంలోకి చెడు బ్యాక్టీరియా చేరుతుంది. ఈ బతుకమ్మలను రకరకాల పూలతో పేర్చి ఆడిపాడి చెరువులో కలుపుతారు. ఆ పూలలో ఉన్న ఔషథ గుణాల వల్ల చెరువు నీరు ప్రక్షాళనమౌతుంది. ఔషధ గుణాల వల్ల పొలాలకు పారిన ఆ నీరు పంటల చీడ పీడలను దూరం చేస్తుందని గ్రామస్తుల నమ్మకం.




బతుకమ్మకు ప్రధానంగా తంగేడు పువ్వు



బతుకమ్మ పేర్చుటలో ప్రధానంగా అడవుల్లో దొరికే తంగేడు పూవు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ పూవులు లేకుండా బతుకమ్మ జరుగదు. పూవులలో శ్రేష్టమైనది గుమ్మడి పువ్వు. ఎందుకంటే గుమ్మడి పువ్వులోని కేసరాలు పసుపు గౌరమ్మకు ప్రతీక. గునుగు, తంగేడు, బంతి, చామంతి, తామెర, కట్ల పూవు, దోసపూవు, బీరపూవు, గడ్డి పూవు తదితర నేక రకాల పూలతో బతుకమ్మను పేరుస్తారు. మట్టితో చేసిన దుర్గమ్మ బొడ్డె దీనినె బాద్రపద పున్నమి బొడ్డెమ్మల పున్నమి అంటారు.


బతుకమ్మ తల్లుల పండుగ, బొడ్డెమ్మ పిల్లల పండుగ



బొడ్డి అంటె చిన్న పిల్ల అని అర్ధం. బొడ్డెమ్మ పెళ్ళికాని పిల్లలు మాత్రమే ఆడతారు. బొడ్డెమ్మను పూజించడమంటే ప్రకృతిని ఆరాధించడం అని ప్రచారంలో ఉంది. తెలంగాణలో ఆడపిల్లల్ని చిన్నప్పుడు బొడ్డి, బొడ్డెమ్మ అని పిలుస్తారు. అంటే తల్లికి అనుసంధానమైనదని రేపటి బతుకకు మూలమైనదని అందుకే బతుకమ్మ తల్లుల పండుగ, బొడ్డెమ్మ పిల్లల పండుగ అయ్యింది.


శనివారం నుండి 9 రోజులు ఒక్కొరోజు ఒక్కో ప్రత్యేకత సత్తుపిండి తదితర ఫలహారాలతో మహిళలకు శక్తి

శనివారం మొదటి రోజు నువ్వులు, నూకల నైవేద్యంతో ఎంగిలిపూల బతుకమ్మ పేరుతో ఎంగిలి పడ్డాక (తిన్నాక) పేరుస్తారు. 
2వ రోజు పప్పు, బెల్లం అటుకుల బతుకమ్మ పేరుతో పూజిస్తారు. 
3వ రోజు తడి బియ్యం బతుకమ్మ. 
4వ రోజు నాన బియ్యం బతుకమ్మ. 
5వ రోజు అట్ల బతుకమ్మ. 
6వ రోజు అలిగిన బతుకమ్మ( అర్రెం,ఈ రోజు బతుకమ్మ ఆడరు) 
7వ రోజు వేపకాయల బతుకమ్మ బియ్యం పిండిని వేప పండు ఆకారంలో తయారు చేస్తారు. 
8వ రోజు వెన్న, నువ్వులు, బెల్లంతో వెన్నె ముద్దల బతుకమ్మ. 
9వ చివరి రోజు సద్దుల బతుకమ్మ. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో అంటూ కోలాటం వేస్తు పాటలు పాడారు. అనంతరం మగవారు బతుమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు. వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధుల నుండి తమను తాము రక్షించుకోవడానికి ఈ ఫలహారాలు స్త్రీలకు శక్తినిస్తాయి.

Post a Comment

0 Comments