నాణ్యమైన విత్తన సాగుకు శాస్త్రవేత్తల బృందం క్షేత్ర సందర్శన
న్యూస్ పవర్,16 సెప్టెంబర్, ఇల్లంతకుంట:
వానకాలం సాగులో నాణ్యమైన విత్తనాలు అందించేందుకు "ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనం" కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు వ్యవసాయ శాఖ సహకారంతో ప్రతి గ్రామంలో ముగ్గురు రైతులకు వరి మరియు పెసర విత్తనాలను పంపిణీ చేయడం జరిగింది.
ఇల్లంతకుంట మండలంలోని వివిధ గ్రామాల్లో జరిగిన క్షేత్ర సందర్శనలో, వ్యవసాయ పరిశోధన స్థానం (కరీంనగర్) శాస్త్రవేత్త డా. ఇ. రజనీకాంత్, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం (కరీంనగర్) శాస్త్రవేత్త డా. కె. మదన్ మోహన్ రెడ్డి , వ్యవసాయ విస్తరణ అధికారులతో కలిసి రైతులు సాగు చేస్తున్న వరి మరియు పెసర పంటల వైపు పరిశీలన జరిపారు.
శాస్త్రవేత్తల బృందం రైతులకు విత్తనోత్పత్తి జాగ్రత్తలు మరియు మెళకువలు వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు శ్రీమతి అర్చన, లలిత, ఇతర అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు.
