ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం
న్యూస్ పవర్ , 16 సెప్టెంబర్, ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండల స్థాయిలో జీవశాస్త్రం సబ్జెక్ట్ నుండి ఉత్తమ ఉపాధ్యాయులుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కందికట్కూరు నుండి శ్రీ కూస మల్లారెడ్డి ఎంపిక కావడం గ్రామానికి మరియు పాఠశాలకు ఎంతో గర్వకారణం అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖాధికారి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలకు ఉత్తమ బోధన, విలువలు నేర్పుతూ వారిని సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడ్డందుకు గుర్తింపు ఉంటుందని తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు వారిని ఘనంగా సన్మానించడం జరిగింది. వారికి ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం తరఫున హార్దిక శుభాకాంక్షలు.
