మౌలిక వసతులు కల్పించాలి
• కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
• ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ లో ఇందిరమ్మ కాలనీలో పరిశీలన
న్యూస్ పవర్ , సెప్టెంబర్ - 17,ఇల్లంతకుంట:
ఇందిరమ్మ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో బుధవారం కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కాలనీలో నీరు నిలిచి ఉండడాన్ని కలెక్టర్ గమనించారు. ఈ కాలనీలో సీ సీ రోడ్డు, మురుగు కాలువలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. కాలనీలో కావలసిన అన్ని వసతులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. స్థానికులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ పర్యటన లో ఎంపీడీఓ శశికళ, శ్రీనివాస్, నాయబ్ తహశీల్దార్ తదితరులు పాల్గొన్నారు.
