విద్యాలయం ఆవరణ పరిశుభ్రంగా ఉండాలి
• ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట మోడల్ స్కూల్ లో ఆకస్మిక తనిఖీ
• ప్రతి విద్యార్థి అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.
న్యూస్ పవర్, సెప్టెంబర్ - 17,ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామంలోని తెలంగాణ మోడల్ పాఠశాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులు పరిశీలించి, విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్న తీరును, మధ్యాహ్న భోజనం, పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణపై ఆరా తీశారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడారు. అన్ని సబ్జెక్టుల పాఠ్యాంశాలు నిత్యం చదివించాలని, రాయించాలని సాధన చేయించాలని సూచించారు. విద్యాలయం ఆవరణ నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, అన్ని పాఠ్యాంశాలపై విద్యార్థులకు పట్టు వచ్చేలా మెరుగైన రీతిలో బోధించాలని ఆదేశించారు.
