జడ్పిహెచ్ఎస్ ఇల్లంతకుంటలో చట్టాలపై అవగాహన సదస్సు
న్యూస్ పవర్ , 18 సెప్టెంబర్, ఇల్లంతకుంట:
రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇల్లంతకుంట: గురువారం రోజున జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఇల్లంతకుంటలో ఎడపల్లి అపర్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సహకారంతో "చట్టాలపై అవగాహన సదస్సు"ను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ జడ్జి శ్రీమతి రాధిక జస్వాల్ హాజరై విద్యార్థులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ, పోక్సో చట్టం, పిల్లల హక్కులు, మాదక ద్రవ్యాల వలన కలిగే ప్రమాదాలు, జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయవ్యవస్థ పనితీరు గురించి వివరించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ఎం. ప్రేమలత మాట్లాడుతూ, ఈ సదస్సు ద్వారా విద్యార్థులకు చట్టపరమైన అవగాహన పెరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరమయ్యే అంశాలు కలిగి ఉంటాయి అని తెలిపారు.
ఎడపల్లి అపర్ణ ఫౌండేషన్ అధ్యక్షుడు, హైకోర్టు అడ్వకేట్ ఎడపల్లి హరీష్ మాట్లాడుతూ, విద్యార్థులకు చట్టాలపై అవగాహన పెరగడం వల్ల వారు భవిష్యత్తులో సమాజంలో మంచి పౌరులుగా ఎదగగలరని, "నేటి బాలలే రేపటి పౌరులు" అనే దృష్టితో ప్రతి ఒక్కరూ చట్టాల పట్ల జాగ్రత్తతతో ముందుకు సాగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వి. మహేష్ చంద్ర, ఆర్. రమణారెడ్డి, ఎం. మంజుల, ఎం. లత, పి. అనిల్ కుమార్, పి. సునీత, ఏ. కవిత, పి. స్వప్న, సి.హెచ్. సంపత్ రావు, ఎన్. సత్తయ్య, ఫయాజ్ మొహమ్మద్, ఎస్. సుజాత దేవి, అలాగే విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
