వికలాంగుల పెన్షన్ పెంపు కోసం ఎంఆర్ఫ్ఎస్-వీఎచ్పీఎస్ వినతిపత్రాల సమర్పణ
న్యూస్ పవర్ , 20 సెప్టెంబర్ , ఇల్లంతకుంట:
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో వికలాంగుల సంక్షేమం కోసం ప్రకటించిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎంఆర్ఫ్ఎస్-వీఎచ్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ ప్రకారం వికలాంగులకు నెలకు రూ.6000 పెన్షన్, ఇతర ఆసరా పెన్షన్లు రూ.4000, తీవ్ర వైకల్యం ఉన్న వికలాంగులకు రూ.15000 పెన్షన్ వేగంగా మంజూరు చేయాలని, హామీ ఇచ్చిన తేది నుండి బకాయిలతో సహా చెల్లించాలనీ వినతిపత్రాలలో పేర్కొన్నారు. కొత్తగా దరఖాస్తు చేసిన వారి పెన్షన్లను దరఖాస్తు చేసిన తేది నుంచి మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎంఆర్ఫ్ఎస్-వీఎచ్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీలు, మున్సిపల్ కార్యాలయాల్లో వినతిపత్రాల సమర్పణ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఇల్లంతకుంట మండలంలో ఈ ఉద్యమం ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. ఇల్లంతకుంట, వెంకట్రావుపల్లె, సోమారం పేట, ముస్కానిపేట, గాలిపెల్లి, గొల్లపెల్లి, వల్పంపట్ల గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద నిరసనలు చేపట్టి, పంచాయతీ కార్యదర్శులకు వినతిపత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి జిల్లా అధికార ప్రతినిధి గుండ్రేడ్డి రాజు మాదిగ, ఎంఆర్ఫ్ఎస్ జిల్లా కో కన్వీనర్ సావనపెల్లి రాకేష్ మాదిగ, ఎంఆర్ఫ్ఎస్ మండల అధ్యక్షుడు మంద రాజు మాదిగ, వీఎచ్పీఎస్ మండల అధ్యక్షులు కే లక్ష్మా రెడ్డి, ఎంఆర్ఫ్ఎస్ మండల ఉపాధ్యక్షులు కాసుపాక సురేష్ మాదిగ
గ్రామ పెద్దలు, మల్లుగారి దేవేందర్ రెడ్డి, కొందికొప్పుల రాజయ్య, మామిడి రాయమల్లు, శంకర్, లకపాక శంకర్, మామిడి రాజు, మచ్చ రాజలింగం, సావనపెల్లి రాములు, సామ నర్సింహా రెడ్డి, అరుకొలు కనుకవ్వ, చక్రాల పోచయ్య, కుర్ర కనుకయ్య కుటుంబాలు మరియు మహిళా నాయకులతో పాటు పలు స్థానికులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
