కలెక్టర్ పెద్దలింగాపూర్లో ఆసుపత్రి, పాఠశాల ఆకస్మిక తనిఖీ
న్యూస్ పవర్ ,16 సెప్టెంబర్ ,ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం, పెద్దలింగాపూర్ గ్రామంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం జరగకూడదని సిబ్బందికి సూచించారు. కేంద్రంలోని విభాగాలు, వార్డులు, ఫార్మసీ, హాజరు వివరాలు, మరియు రోగుల సంఖ్యను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన రోగుల అభిప్రాయాలను స్వయంగా తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు విశ్వసనీయంగా ఉండాలని, సిబ్బంది సమయపాలన మెరుగుపరచాలని కలెక్టర్ చెప్పారు. హాజరు లేకపోతే, సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు సూచనలు చేశారు. ప్రజలకు అవసరమైన వైద్య సమాచారం అందించాల్సిందిగా, అలాగే కేంద్రంలో ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అటు, గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కూడా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం సమయంలో పాఠశాలు సందర్శించి, భోజన నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలు తెలుసుకున్నారు. తరగతి గదులను దర్శించి, ఎల్ఈడీ ప్యానెల్స్ స్థితిని పరిశీలించారు. మధ్యాహ్న భోజనం తప్పనిసరిగా గ్యాస్ స్టోవ్ పైనే తయారు చేయాలని, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి పెట్టీ బోధించాలి అని ఉపాధ్యాయులకు సూచించారు.
