తాళ్లపల్లి – గూడెం రహదారి మరమ్మత్తు
న్యూస్ పవర్ , 15సెప్టెంబర్, ఇల్లంతకుంట :
ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వరద నీటికి తాళ్లపల్లి – గూడెం రోడ్డు దెబ్బతింది. రోడ్డుపై పెద్ద గండులు ఏర్పడి, దానివల్ల ప్రయాణికులు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంతో స్వయంగా రైతులే ముందుకు వచ్చారు.
రైతులు స్వంత ఖర్చుతోనే ట్రాక్టర్లు, జేసీబీలు సమకూర్చుకొని రహదారి గండులను పూడ్చి మరమ్మతు పనులు చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ఎలుక రామస్వామి, అంబటి రాజిరెడ్డి, కళ్లెం వెంకటరెడ్డి, నర్సయ్య, కిరణ్ రెడ్డి, కిట్టు, మహేందర్ తదితరులు సహకరించారు.
