రేపాకలో మార్గదర్శక బోర్డు ఏర్పాటు
• మాజీ ఎంపీటీసీ కథ సుమలత మల్లేశం ప్రయత్నం
న్యూస్ పవర్ , 15 సెప్టెంబర్, ఇల్లంతకుంట:
రేపాక గ్రామ పరిధిలో గ్రామానికి కొత్తగా వచ్చే ప్రయాణికులకు, మార్గం తెలియక ఇబ్బందిపడే పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మాజీ ఎంపీటీసీ కథ సుమలత మల్లేశం స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఈ క్రమంలో రేపాక రామాలయం వద్ద హైదరాబాద్ వెళ్లే రోడ్డు బస్టాప్ వద్ద కొత్త దారిబోర్డు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ కథ సుమలత మల్లేశం మాట్లాడుతూ ప్రయాణికులకు సులభంగా మార్గం తెలిసేలా ఇంకా మూడు చోట్ల కొత్త బోర్డులు ఏర్పాటు చేయనున్నాను. రేపాక బస్స్టాండ్, బాలయ్య హోటల్ మరియు అంబేద్కర్ భవన్ వద్ద త్వరలో బోర్డులు అమర్చబడతాయి అని తెలిపారు.
నూతన బోర్డు ఆవిష్కరణ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ప్రవీణ్, ఎట్ల ఐలయ్య, కూన మారుతి, సందవేని బాలయ్య, పండుగ లచ్చయ్య, నర్రా నవీన్, కూన సంతు తదితర గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
