ఘనంగా ఇల్లంతకుంట మాజీ ఎంపీపీ జన్మదిన వేడుకలు
న్యూస్ పవర్, 13 సెప్టెంబర్, ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండల మాజీ ఎంపీపీ గుడిసె అలయ్య జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు శ్రీ కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి , మాజీ ఎంపీపీ ఉట్కూరి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేయించి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి సంజీవ్, అంతగిరి పోచమ్మ టెంపుల్ చైర్మన్ కొలపూరి అంతగిరి తో, పాటుగా మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డు సభ్యులు, యువజన సంఘాల సభ్యులు, వర్తక వ్యాపారులు, తదితరులు పాల్గొన్నారు.
