తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలకు ఘన ప్రారంభం
న్యూస్ పవర్ , 11 సెప్టెంబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం, గాలిపెల్లిలో గురువారం రోజున తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు ప్రారంభమయ్యాయి, మండల కేంద్రం నుండి 30 బండ్లతో బైక్ ర్యాలీ జరిపి, గ్రామానికి చేరుకున్న తర్వాత కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు సభకు మంద అనిల్ కుమార్ అధ్యక్షత వహించగా, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం హిందూ ముస్లిం సామరస్యంతో సాగిందని, దీనిని మతపోరాటంగా చూపడం పెద్ద తప్పంటూ విమర్శించారు ప్రభుత్వాలు త్వరలో 'విలీన దినోత్సవాన్ని' అధికారికంగా నిర్వహించాలని, పోరాటయోధుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్, ఇతర నాయకులు, రైతులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
