భవిష్యత్తు భారత నిర్మాణంలో విద్యార్థులే ప్రధాన పాత్రధారులు
జనం న్యూస్ , 9 సెప్టెంబర్, ఇల్లంతకుంట:
జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ జి. నాగేశ్ ఇల్లంతకుంట లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల పనితీరు, బోధన విధానాలను సమీక్షించిన ఆయన, మధ్యాహ్న భోజన నిర్వహకులతో చర్చించి కల్పిస్తున్న సదుపాయాలను అభినందించారు.
సమాజ భాగస్వామ్యంతో నిర్మించబడిన అదనపు తరగతి గదులు, ఉపాధ్యాయుల సహకారంతో తీసుకువస్తున్న మౌలిక వసతులను పరిశీలించి ప్రశంసించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడిన ఆయన భవిష్యత్తు భారత నిర్మాణంలో విద్యార్థులే ప్రధాన పాత్రధారులు అని పేర్కొంటూ, రాబోయే పబ్లిక్ పరీక్షల్లో విజయవంతం కావడానికి కష్టపడి చదవాలని, ఉపాధ్యాయుల సహకారాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి ఎం. ప్రేమలతో పాటు సీనియర్ ఉపాధ్యాయులు వి. మహేష్ చంద్ర, రమణారెడ్డి, మధుసూదన్ రావు, లత, సునీత, సరిత, ఫయాజ్ మహమ్మద్ మరియు సుజాత దేవి పాల్గొన్నారు.
