గణపతి నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలి
న్యూస్ పవర్, 3 సెప్టెంబర్, ఇల్లంతకుంట:
కాంగ్రెస్ పార్టీ మానకొండూర్ నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్, ఇల్లంతకుంట మండలంలోని అన్ని గ్రామాల్లో వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మండలంలోని అధికారులను అభ్యర్థించారు
ఈ సందర్భంగా వినయ్ కుమార్ మాట్లాడుతూ, భక్తులందరూ అత్యంత భక్తిశ్రద్ధలతో నవరాత్రులు వినాయకుని పూజించి, గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేసేందుకు చెరువులు, కుంటలు, వాగుల వద్దకు వస్తారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, చెరువుల వద్ద తగినంత లైటింగ్ ఏర్పాటు చేయాలని, అలాగే ఇతరత్రా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరారు .
భక్తులు కూడా భక్తిశ్రద్ధలతో వినాయకుని నిమజ్జనం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు , రోడ్లపై విగ్రహాలను తరలించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ప్రత్యేకించి కరెంటు తీగలను గమనిస్తూ పలు జాగ్రత్తలు పాటించాలని, అధికారులకు సహకరించాలని ఆయన కోరారు .
