స్థానిక సంస్థల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు
న్యూస్ పవర్, 31 ఆగస్ట్ , ఇల్లంతకుంట :
అసెంబ్లీలో రిజర్వేషన్ల క్యాప్‌ను ఎత్తివేస్తూ, స్థానిక సంస్థలలో బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు బిల్లు ఆమోదించినందుకు బిసి సమాజం తరపున హర్షం వ్యక్తం చేస్తున్నట్లు మానకొండూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్ తెలిపారు . ఈ నిర్ణయం పట్ల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కి, లోక్ సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కి, అలాగే మంత్రి వర్గానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు వినయ్ కుమార్ పేర్కొన్నారు , ఈ చర్య వల్ల రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక జెడ్పి చైర్మన్లు, యంపిపి లు బిసి లు అయ్యే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు .
