అక్రమంగా గంజాయి అమ్మడానికి వచ్చిన వ్యక్తి అరెస్ట్, రిమాండ్ కి తరలింపు

అక్రమంగా గంజాయి అమ్మడానికి వచ్చిన వ్యక్తి అరెస్ట్, రిమాండ్ కి తరలింపు


న్యూస్ పవర్ , 15 ఫిబ్రవరి , ఇల్లంతకుంట :
అక్రమంగా గంజాయి అమ్మడానికి వచ్చిన వ్యక్తి అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు సిరిసిల్ల రూరల్ సి.ఐ మొగిలి తెలిపారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఇల్లంతకుంట మండలం గోళ్లేపల్లి గ్రామానికి చెందిన పున్ని వేణు అనే వ్యక్తి ఆటో డ్రైవర్ గా చేస్తూ వచ్చిన డబ్బులతో గంజాయి  కోని గంజాయి తాగుతూ జల్సాలు చేసేవాడు అట్టి డబ్బులు సరిపడక గంజాయి త్రాగేవారికి అమ్మి ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనే ఆలోచనతో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద గంజాయి కొనుగోలు చేసి గంజాయి కి అలవాటు పడిన వారికి అమ్మడానికి జాంగారెడ్డి పల్లె గ్రామ శివారులో రాగ నమ్మదగిన సమాచారం మేరకు ఇల్లంతకుంట ఎస్. ఐ తన సిబ్బందితో జాంగారెడ్డి పల్లె గ్రామ శివారులోకి రాగ అక్కడ అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద ఉన్న కవర్ లో తనిఖీ చేయగా 60 గ్రాముల గంజాయి ఉండగా అట్టి గంజాయి స్వాధీనం చేసుకొని వేణు పై కేసు నమోదు చేసి ఈ రోజు రిమాండ్ కి తరలించడం జరిగిందని సి.ఐ మొగిలి తెలిపారు. 
గంజాయి తాగే వారిని పట్టుకునేందుకు జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లకి గంజాయి టెస్ట్ కిట్లు అందుబాటులోకి వచ్చాయని ప్రతి పోలీస్ స్టేషన్ లలో రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే గంజాయి టెస్ట్ నిర్వహించి వాటికి బానిసై తాగే వారిని పట్టుకోవడం జరుగుతుందని,ప్రజలు ఎవరైనా గంజాయి కి సంబంధించిన సమాచారం డయల్100 లేదా టాస్క్ఫోర్స్ సి.ఐ ఫోన్ నెంబర్ 87126 56392 కి సమాచారం అందించగలరని,సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుదన్నారు.

Post a Comment

0 Comments