జనం న్యూస్ 17 ఫిబ్రవరి , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గాలిపల్లి లో జరిగిన జిల్లాస్థాయి సబ్ జూనియర్ బాలబాలికల కబడ్డీ పోటీలు ఆదివారం ముగిసినవి. ఈతరం యువజన సంఘం గాలిపల్లి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ ముగింపు పోటీలకు కరీంనగర్లోని రాఘవేంద్ర హాస్పిటల్ డాక్టర్ గాజర్ల శరత్ కుమార్ తుమ్మిడి శెట్టి వెంకటేశ్వరరావు హాజరై క్రీడాకారుల ఉద్దేశించి క్రీడల వలన శరీర దృఢత్వంతో పాటు మానసిక వికాసం కలుగుతుందని తెలియజేసివిజేతలకు బహుమతి ప్రధానోత్సవం చేసినారు. ఆదివారం జరిగిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలలో 26 బాలుర, 18 బాలికల జట్లు పాల్గొన్నాయి ఇట్టి పోటీలలో ప్రతిభ కనపరచిన క్రీడాకారులను ఈనెల 20 నుండి జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు పంపిస్తామని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ముస్కు మల్లారెడ్డి, సింగారపు తిరుపతి తెలియజేశారు ఇట్టి పోటీలలో బాలుర విభాగంలో బోయిన్పల్లి ప్రధమ ఇల్లంతకుంట ద్వితీయ బాలికల విభాగంలో రహీంఖాన్పేట్ మోడల్ స్కూల్ ప్రథమ సిరిసిల్ల ద్వితీయ స్థానంలో నిలిచినాయి. ఇట్టి పోటీలకు ఫోరమ్ ఫర్ సంస్థ వారు బహుమతులు అందించారు.ఇట్టి పోటీలలో ఈతరం యువజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు జి. నరేశ్, ఇ. చింటు,కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ సంపత్ రావు జిల్లా కబడ్డీ కోశాధికారి దేవత ప్రభాకర్ కరీంనగర్ జిల్లా కబడ్డీ అధ్యక్షులు బి మల్లేష్ గౌడ్ పెటాటిఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి. అనిల్ గౌడ్ ఎల్ డేవిడ్సన్ ఇల్లంతకుంట కబడ్డీ కార్యదర్శి మామిడి శ్రీనివాస్ సిరిసిల్ల కబడ్డీ అధ్యక్ష కార్యదర్శులు బొడ్డు నారాయణ,మదన్ వ్యాయామ ఉపాధ్యాయులు సాన బాబు జోగినిపల్లి రవీందర్రావు బి సంతోష్, పి. ప్రభాకర్, కె. నరేష్,పాల్గొన్నారు.
0 Comments