• కలెక్టర్ సందీప్ కుమార్ ఝా • ఆర్డీవోలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్
రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి -15 జిల్లాలో ఇసుక రవాణాపై నిరంతరం నిఘా పెట్టాలని ఆర్డీవోలు, తహసీల్దార్లను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఇసుక రవాణాపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో అనుమతి ఉన్న ఇసుక రీచ్ ల నుంచి మాత్రమే తరలించాలని, వే బిల్, డ్రైవర్ కు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. అనుమతి లేని వాగుల నుంచి ఇసుక తరలించకుండా నిఘా పెట్టాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు, ఇతర అవసరాలకు ఇసుక అవసరం ఉంటుందని తెలిపారు. అక్రమంగా ఇసుక తరలించే వారిపై కేసులు పెట్టాలని, ఆయా చోట్ల ఇసుక అక్రమంగా తరలించకుండా కందకాలు తవ్వించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో సిరిసిల్ల ఇన్చార్జి ఆర్డీవో రాధాభాయ్, వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
0 Comments