న్యూస్ పవర్, 22 ఫిబ్రవరి , ఇల్లంతకుంట : బేటీ బచావో బేటీ పడావో దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అనంతగిరి లో బాలికలకు చిత్రలేఖన, ఉపన్యాస, వ్యాసరచన, పలు క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. చిత్రలేఖన పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరచిన 9వ తరగతి విద్యార్థిని శ్రీవిద్య ను, గైడ్ టీచర్ ఫరీద్ ని ప్రధానోపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ , ఉపాధ్యాయులు , తల్లిదండ్రులు, గ్రామస్థులు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా బాలికలు చదువుతో పాటు సహా పాఠ్య కార్యక్రమాల్లో కూడా ముందుండాలని. బాలికలను చదువులో ప్రోత్సహించాలని, అమ్మాయిలు బాగా చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో ఉండాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మొహమ్మద్ గౌస్ తెలియజేసారు.