ఇల్లంతకుంటలో కందుల కొనుగోలు సెంటర్ ప్రారంభం
వ్యవసాయ మార్కెట్ కమిటీ ఇల్లంతకుంట యార్డు నందు నూతనముగా కందుల కొనుగోలు కేంద్రము ప్రారంభించబడినది ఇట్టి కొనుగోలు కేంద్రము మార్క్ ఫెడ్ వారి ఆధ్వర్యంలో పాక్స్ ఇల్లంతకుంట వారు కొనుగోలు చేయుచున్నారు. ఇట్టి కొనుగోలు కేంద్రంలో క్వింటాకి ఒక్కంటికి రూ.7550/-మద్దతు ధరతో రైతులు నేరుగా కందులు అమ్ముకొనే సదుపాయము కలదు. కావున ఇట్టి అవకాశమును ఇల్లంతకుంట మండల రైతు సోదరులు సద్వినియోగం చేసుకొనగలరని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి తెలియజేశారు. మరియు పాక్స్ కార్యదర్శి సిబ్బంది పాల్గొన్నారు.
