• పట్టభద్రులు విజ్ఞతను ప్రదర్శించాలి • మొదటి ప్రాథాన్యత ఓటు నరేందర్ రెడ్డికే వేయాలి • ఇల్లంతకుంట మండల పార్టీ విస్తృతసమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి
న్యూస్ పవర్ , 22 ఫిబ్రవరి , ఇల్లంతకుంట : పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డి గెలుపుతోనే పట్టభద్రులకు మేలు జరుగుతుందని మానకొండూర్ శాసనభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వైశ్య భవన్ లో పార్టీ మండల అధ్యక్షుడు బి.రాఘవరెడ్డి అధ్యక్షతన జరిగిన మండల విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వూట్కూరి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీగా నరేందర్ రెడ్డి గెలిపించు కోవాల్సిన చారిత్రక అవసరం పట్టభద్రులపై ఉందన్నారు. పోటీలో ఉన్న ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో సేవ చేసే గుణం, పనులు చేసి పెట్టే సత్తా ఎవరికి ఉందో పట్టభద్రులు బేరీజు వేసుకోవాలని, ఓటు వేసే విషయంలో విజ్ఞతను ప్రదర్ళించాలని ఆయన పట్టభద్రులను కోరారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నరేందర్ రెడ్డి అధ్యాపక వృత్తి చేపట్టి విద్యాసంస్థల అధిపతి వరకు ఎదిగారని, ఎంతో పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడమే కాకుండా ఫీజుల్లోనూ రాయితీ కల్పిస్తున్నారని, అంతేకాకుండా తన విద్యాసంస్థల్లో 5వేల మందికి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించారని చెప్పారు.వృత్తిపట్ల నరేందర్ రెడ్డికి ఎంత అంకితభావం ఉందో పట్టభద్రుల సమస్యల పరిష్కరించే విషయంలోనూ అంతే నిబద్ధతను ప్రదర్శిస్తారన్నారు. కులం,మతం ముసుగులోపడి మోసపోవద్దని ఆయన పట్టభద్రులకు హితవు పలికారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై ప్రత్యర్థి అభ్యర్థులు పనిగట్టుకొని దుష్ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్యే కవ్వంపల్లి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు,రైతు రుణమాఫీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు గురించి విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. స్థానికుడు, మనకు అందుబాటులో ఉండే నరేందర్ రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ రఘువర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఊట్కూరి వెంకట రమణా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతగిరి వినయ్ కుమార్, పసుల వెంకట్, ఎలగందుల ప్రసాద్, చిట్టి ఆనంద రెడ్డి, కడగండ్ల తిరుపతి, అంతగిరి బాల పోచయ్యతోపాటు పలు గ్రామాల పార్టీ అధ్యక్షులు, క్లష్టర్,బూత్ ఇంచార్జీలు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.