ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించే పదవ తరగతి టాలెంట్ టెస్ట్ విజయవంతం చేయండి
• ఇల్లంతకుంట మండల కేంద్రంలో టాలెంట్ టెస్ట్ కరపత్రం ఆవిష్కరణ
• ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కళ్యాణ్ కుమార్
న్యూస్ పవర్ , 22 ఫిబ్రవరి , ఇల్లంతకుంట :
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 24, 25 తేదీలలో పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించే టాలెంట్ టెస్ట్ విద్యార్థులుoదరూ సద్వినియోగం చేసుకోవాలనీఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కళ్యాణ్ కుమార్ అన్నారు , ఇల్లంతకుంట మండల కేంద్రంలో టాలెంట్ టెస్ట్ కరపత్రం ఆవిష్కరణ చెయ్యడం జరిగింది
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ... ఎస్ఎఫ్ఐ పదవ తరగతి విద్యార్థులకు ఇలాంటి టాలెంట్ టెస్టులు విద్యార్థులందరూ ఇలాంటి పోటీ పరీక్షలు రాసి వచ్చే పబ్లిక్ పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించాలని తెలిపారు
అనంతరం పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రతి సంవత్సరం టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తామని ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 24 25 తేదీలలో జిల్లా వ్యాప్తంగా టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నామని తెలిపారు ఎస్ఎఫ్ఐ నిరంతరం విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే విద్యార్థులు చదువులో ముందుండాలని విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకత శక్తిని వెలికి తీసేందుకు వారి లోపల భయాన్ని పోగొట్టి త్వరలో జరిగే పబ్లిక్ పరీక్షలకు సిద్ధం చేసేందుకు ఈ టాలెంట్ టెస్ట్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు 24న సిరిసిల్ల డివిజన్ వ్యాప్తంగా 25న వేములవాడ డివిజన్ వ్యాప్తంగా టాలెంట్ టెస్ట్ ఉంటుందని ఇట్టి టాలెంట్ టెస్టులు పరీక్ష ఫీజు 30 రూపాయలు ఉంటుందని తెలిపారు
టాలెంట్ టెస్ట్ లో పాల్గొనే విద్యార్థులు ఫిబ్రవరి 23 తేదీ లోపు ఎస్ఎఫ్ఐ నాయకులు
గుండెల్లి కళ్యాణ్ 7815924830,
జాలపల్లి మనోజ్ 9441760430
మల్లారపు ప్రశాంత్ 9908246341 లను సంప్రదించాలని కోరారు లేదా సంబంధిత పాఠశాలలో వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు
ఈ కార్యక్రమంలో వంశీ,శివ,హరీష్,మహేష్,కిరణ్, సాయి నాయకులు పాల్గొన్నారు .
