యువతి వివాహానికి ఆర్థిక సహాయాన్ని అందించిన మాజీ ఎంపీపీ వుట్కూరి వెంకట రమణ రెడ్డి
న్యూస్ పవర్ , 22 ఫిబ్రవరి , ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన నిరుపేద పారిశుద్ధ్య కార్మికురాలు మంద బాలలక్ష్మి కూతురు మంద అనూష పెళ్లికి మానకొండూరు శాసనసభ్యుడు కవ్వంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా చీర మరియు పది వేల రూపాయలు మాజీ ఎంపీపీ వుట్కూరి వెంకట రమణ రెడ్డి అందజేశారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపు అనూష పెళ్లి ఉన్నందున వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండడం వల్ల ఈ పేద కుటుంబాన్ని ఆదుకోవడానికి ఒక చీర మరియు 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించామన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మంద రాములు, లింగయ్య, కాంగ్రెస్ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ కడగండ్ల తిరుపతి అడ్వకేట్,రాజయ్య, శీను, శంకర్, చంద్రయ్య, సుమన్, మహేష్,కిష్టస్వామి మరియు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
