JSON Variables

13న డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు గృహప్రవేశం

13న డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు గృహప్రవేశం

• స్వయంగా లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశం చేయించనున్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ 

• లబ్ధిదారులతో సమావేశమైన ఎంపీపీ రమణారెడ్డి 
జనం న్యూస్ , 11 మార్చి , ఇల్లంతకుంట :
ఈనెల 13న ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమాన్ని  మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు  ఎంపీపీ  వుట్కూరి వెంకటరమణారెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా సోమవారం పెద్ద లింగాపూర్ గ్రామానికి చెందిన 40 మంది లబ్ధిదారులతో  తాసిల్దార్ జావేద్  ఆహ్మద్  నేతృత్వంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డబల్ బెడ్ రూమ్ ఎంపిక కోసం 40 మంది లబ్ధిదారులను డ్రా ద్వారా ఎంపిక చేశారు.   ఈ కార్యక్రమంలో తాసిల్దార్ జావేద్ హమ్మద్, ఆర్ ఐ షఫీ, మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య యాదవ్, విఆర్ఓ సింగారెడ్డి, డైరెక్టర్ గన్నారం వసంతనరసయ్య ,పసువుల బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments