రైతు ప్రభుత్వమని చెప్పి...రైతులను ఆగం చేస్తున్న కాంగ్రెస్
• రైతులకు ఎకరాకు ₹25వేల పంట నష్ట పరిహారం అందించాలి • కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ • ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామంలో ఎండిన పంటపొలాల పరిశీలన
న్యూస్ పవర్ , 26 మార్చి , ఇల్లంతకుంట : రైతుల బాధలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని ,యాసంగి పంటలకు సాగునీళ్లు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మేడిగడ్డ వద్ద గోదావరి నదిలో రోజుకు 5000ల క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోయి సముద్రంలో కలుస్తున్న కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని...కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 50 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిశాయని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. మానకొండూర్ నియోజకవర్గములోని ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామంలో ఎండిన వరి పొలాలను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపిందని అన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ మూడు పిల్లర్లు కుంగితే దానిని సాకుగా చూపించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను ఎండబెట్టి , సాగునీళ్లు ఇవ్వకుండా రైతులను కన్నీరు పెట్టిస్తోందని పేర్కొన్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. ప్రభుత్వం రైతులకు ఎకరాకు ₹25వేల పంట నష్ట పరిహారం అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్మన్ సిద్ధం వేణు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, మాజీ సర్పంచ్ బిల్లవేని పర్శరాం, మాజీ ఏఎంసీ చైర్మన్ వేణురావు, అనంతగిరి ఎంపీటీసీ పర్శరాం, గుండ ముత్తయ్య,కెవిఎన్ రెడ్డి, గాదె కనకయ్య, బిల్లవేని చంద్రయ్య, కొమ్ము కనకయ్య, ఏనుగుల పర్శరాం, ఏనుగుల బుచ్చిరెడ్డి, కూస నరేష్, బిల్లవేని సాయి, ఆరే కొమురయ్య, జక్కుల నాగరాజు యాదవ్, దూలం సంపత్ గౌడ్, సంతోష్ రెడ్డి, ఆళ్వాల రాజేశం, రమేశ్,ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments