కాంగ్రెస్ కు అధికారమిస్తే దోపిడే
జనం న్యూస్ , 15 నవంబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలంలోని ముస్కానిపేట గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మానకొండూర్ నియోజకవర్గాన్ని అభివృద్ది చేసిన రసమయి బాలకిషన్ మరో సారి ఆశీర్వధించి కారు గుర్తు ఓటేయ్యాలని రాజన్న సిరిసిల్లా జిల్లా జెడ్పీ వైస్ చైర్మేన్ సిద్దం వేణు ,బీఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహరెడ్డి,స్థానిక ఎంపిటిసి సావనపెల్లి వనజ అనిల్ మరియు గ్రామ ప్రజా ప్రతినిధులతో నాయకులతో గ్రామంలో గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు,
అనంతరం వారు మాట్లాడుతూ 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో జరగని అభివృద్ధిని సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లలో చేసి చూపించారని అన్నారు. కొట్లాడు తెచ్చుకున్న తెలంగాణను దొంగల చేతిలో పెట్టద్దని అభివృద్ధి కావాలంటే ప్రజలు బీఆర్‌ఎస్ పార్టీకి ఓటేసి మరో సారి రసమయి బాలకిషన్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని,కాంగ్రెస్‌కు అధికారం యిస్తే అభివృద్ధి కుంటుపడుతుందని ఉన్న పథకాలకు మంగళం పాడి రాష్ర్టాన్ని దోపిడీ చేస్తారని అన్నారు.తెలంగాణ అభివృద్ధిలో దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనులు, పథకాలను అన్ని రాష్ర్టాల్లో అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక మానకొండూర్ నియోజకవర్గాన్ని రసమయి బాలకిషన్ ఊహించని అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దాడని 50 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు తెలంగాణను అభివృద్ధి చేయకుండానే, ఇప్పుడు మళ్లీ తమకు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ కోరుతున్నారని సిగ్గు చేటని అన్నారు.తెలంగాణను ఇతరుల చేతుల్లో పెట్టవద్దని, పొరపాటున వేరేవారికి అధికారం ఇస్తే రాష్ట్రం మన మానకొండూర్ నియోజకవర్గం ఆగమాగమవుతుందని అన్నారు,
ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ మల్లుగారి రవిందర్ రెడ్డి,గాలిపెల్లి ప్యాక్స్ చైర్మేన్ అన్నాడి అనంతరెడ్డిరమేశ్ రెడ్డి, తిరుపతి రెడ్డి,నాయకులు,యువకులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments