JSON Variables

కాంగ్రెస్ పార్టీలో చేరికలు

కాంగ్రెస్ పార్టీలో చేరికలు

న్యూస్ పవర్ , 15 నవంబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలంలోని పాక్స్ డైరెక్టర్ సుజన్ రెడ్డి, అనంతగిరి  గ్రామానికి మల్లారెడ్డి, చంద్రయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ  కాంగ్రెస్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
 మండలంలోని రేపాక గ్రామానికి చెందిన యాదవ్ సంఘ నాయకులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు .
ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ  బిఆర్ఎస్ దొంగ హామీలను మాయమాటలు నమ్మే పరిస్థితి లో ప్రజలు లేరని మానకొండూర్ నియోజకవర్గ అభివృద్ధి,ప్రజల సంక్షేమం కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం అవుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ వుట్కూరి వెంకటరమణారెడ్డి , మాజీ ఎంపీపీ గుడిసే ఐలయ్య, ఎంపీటీసీ సుమలత -మల్లేశం, గ్రామ శాఖ అధ్యక్షుడు దయాసాగర్,యాదవ్ సంఘ అధ్యక్షుడు రాములు, ప్రజా ప్రతినిధులు, గ్రామ రైతులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.Post a Comment

0 Comments