JSON Variables

ఎన్నికలు సజావుగా సాగేలా అందరు సహకరించాలి


ఎన్నికలు సజావుగా సాగేలా అందరు సహకరించాలి

• ఇల్లంతకుంట ఎస్ఐ డి.సుధాకర్

న్యూస్ న్యూస్ , 17 నవంబర్ , ఇల్లంతకుంట :
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లంతకుంట మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఇల్లంతకుంట ఎస్ఐ డి.సుధాకర్ కోరారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు మరియు రెండు కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాలు  ఉన్న గ్రామాల్లో ఇల్లంతకుంట ఎస్సై డి సుధాకర్ ఆధ్వర్యంలో సిబ్బంది తో కలిసి వల్లంపట్ల గ్రామంలో కవాతు నిర్వహించి ప్రజలకు ఎన్నికల పట్ల అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇల్లంతకుంట ఎస్సై డి. సుధాకర్ మాట్లాడుతూ మండలంలో మొత్తం 29 పోలింగ్ ప్రదేశాల్లో 58 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని ప్రతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గ్రామాలలో కేంద్ర బలగాలతో పాటు స్థానిక పోలీసు సిబ్బందితో కలిసి కవాతు నిర్వహించడమే కాకుండా ప్రజలకు ఎన్నికల పట్ల అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఎన్నికల సమయంలో పార్టీల నాయకులు గాని, ప్రజలు గాని, యువకులు గాని ఎన్నికల నియమావళిని ఉల్లంఘించకుండా ప్రచారాలు నిర్వహించుకోవచ్చు అని, ఎన్నికల ప్రవర్తన నియమావలిని ఉల్లంగించినట్లైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఎన్నికలలో కేసులు నమోదైతే భవిష్యత్తులో ఉద్యోగాలు రావని మరియు విదేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ కు ఇబ్బంది ఉంటుందని గనుక అందరూ జాగ్రత్తలు వహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట హెడ్ కానిస్టేబుల్ భూమయ్య, కానిస్టేబుల్ మధు, శ్రీకాంత్, జీవన్, లక్ష్మీనారాయణ, హోంగార్డు క్రాంతి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments