JSON Variables

అభివృద్ది నోచుకోని గొల్లపల్లి, వెంకట్రావు పల్లె




 అభివృద్ది నోచుకోని గొల్లపల్లి, వెంకట్రావు పల్లె 

• ప్రజా సంఘాల నాయకుల నిరసన

 న్యూస్ పవర్, 18 నవంబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం వెంకట్రావు పల్లె గ్రామానికి ప్రచారానికి వస్తున్న బిఆర్ఎస్ పార్టీ  ఎమ్మెల్యే అభ్యర్థి రసమయి బాలకిషన్ 'గో బ్యాక్, అంటు మర్రి చెట్టు అవరణలో ప్రజా సంఘాల నాయకులు నిరసన తెలిపారు 
ఈ సందర్భంగా ప్రజా సంఘాల యువజన విభాగం నాయకులు మంద అనిల్ కుమార్ మాట్లాడుతూ
  దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని మయ మాటలతో గద్దెనెక్కిన బిఆర్ఎస్ ప్రభుత్వనికి ఈ ఎలక్షన్ లో తగిన బుద్ది చెప్పాలన్నారు. గతంలో గొల్లపల్లి నుండి చింతలకుంట, జంగంరెడ్డి పల్లె వరకు రోడ్డు నిర్మాణం చేపడతాం అని హామీ ఇచ్చి నేటికీ పది సం" లు గడిచిన తర్వాత ఓటమి భయంతో ఇప్పుడు రోడ్డు పనులు మొదలు చెయ్యటం సిగ్గు చేటు అన్నారు. వెంకట్రావు పల్లె నుండి సోమారంపేట, రేపాక వరకు రోడ్డు సమస్యల వలయంలో ఉండి పోయింది అన్నారు. టీచర్ గా ఎలాంటి ఆస్తులు లేకుండా తెలంగాణ ఉద్యమంలో లింగ దొంగ అని గోసి పట్టి గొంగడి వేసి పాట పాడిన రసమయి రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన ఆస్తులు సంపాదించుకున్నాడు కానీ మీరు వేసిన గొంగడి అక్కడే ఉంది అని గుర్తు చేశారు. గుండారం లో కొన్ని ఎకరాలలో 'ఫామ్ హౌస్' నిర్మించుకున్నారు మరి గొల్లపల్లి, వెంకట్రావు పల్లె ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇవ్వకపోయే అని యగ్ధేవ చేశారు.   గొల్లపల్లి, వెంకట్రావు పల్లె గ్రామ చివరు ల ఎక్కడి వరకు ఎంటి అని చెప్పకుండా మభ్య పెడుతూ ఓట్ల కోసం చేస్తున్నాం అంటు కాలయాపన చెయ్యటం రెండు గ్రామాల నాయకులు ప్రజలు అడిగితే మయ మాటలు చెప్పి తప్పించుకున్నాడు అని అన్నారు. మండలంలో గ్రామాలలో అంబేద్కర్ సంఘాలను రెండుగా చీల్చి తన పార్టీలోని నాయకులే అన్ని కుల సంఘాలలో ముఖ్య నాయకులుగా ఉండాలని వర్గ పోరు సస్తించినారు. దళిత నియోజకవర్గoలో దళితుడు ఎమ్మెల్యే గా ఉన్న కానీ దళితులపై దాడులు తప్పటం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు గ్రామంలో కనిపించని దొర బంధువులు ఇప్పుడు పల్లె లోకి వచ్చి ప్రచార అర్బటలతో యువతని మద్యం మత్తులో దింపుతున్నారు అన్నారు. బిఅర్ఎస్ యువతని మద్యం మత్తుకు అలవాటు చేసి పై చదువులకు దూరం చేస్తూ, ఇసుక పనులకు బిఆర్ఎస్ పార్టీ ప్రచారాలకు, సుక్క ముక్క కి అలవాటు చేస్తూ గొడవలు సుష్టిస్తున్నరు అని అన్నారు. ఇన్ని రోజులుగా గ్రామ అభివృద్ది లో పాల్గొనని వారు గ్రామ ప్రజల సమస్యలపై మాట్లాడని, స్పందించని నాయకులు నేడు మాంసం , మద్యం తో పల్లె పల్లె తిరగటం విడ్డూరంగా ఉంది అని యగ్ధేవా చేశారు. దొరల పాలనలో దళిత, బహుజనలకు న్యాయం జరగలేదు అన్నారు. రైతు బంధు అంటు గొప్పలు చెప్పుకుంటున్న బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు తో తగిన బుద్ది చెప్తాం అని అన్నారు. అంబేద్కర్ విగ్రహం విషయంలో రామజిపేటలో ఇరు వర్గాలకు గొడవలకు కారణం ఎవరు అని అన్నారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తా అని హామీ ఇచ్చిన కెసిఆర్ రసమయి ని ముఖ్యమంత్రి చేసే దమ్ముందా అని డిమాండ్ చేశారు.ప్రజా సమస్యలపై మాట్లాడిన, ఉద్యమాలు ,పోరాటం చేసిన నాయకులను బెదిరించడం, అక్రమ కేసులు పెట్టించటం మానుకోవాలని హెచ్చరించారు. గ్రామంలో ఎమ్ అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. 
ఈ కార్యక్రమంలో గొల్లపల్లి, వెంకట్రావు పల్లె నాయకులు బొప్పెన పర్శరాములు, మామిండ్ల కనుకరాజు, సొల్లు శేకర్, చల్ల నవీన్ రెడ్డి, ఎద్దు రామస్వామి, అనగొని అవినాష్, బత్తిని లక్ష్మణ్, జెట్టి చంద్రయ్య, సొల్లు సాయి కుమార్, సిరవేని రాజు,మంద లింగం, నర్సయ్య,మల్లేష్, బాలయ్య, లక్ష్మణ్, మల్లయ్య  ప్రజా యువజన సంఘాలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments