JSON Variables

మనకు మంచి చేసిన సిఎం కేసీఆర్‌కి అండగా నిలువాలి


మనకు మంచి చేసిన సిఎం కేసీఆర్‌కి అండగా  నిలువాలి 

• బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి  రసమయి బాలకిషన్ న్యూస్ పవర్ , 18 నవంబర్ , ఇల్లంతకుంట :
కాంగ్రెస్ పార్టీ మాటాలు నమ్మితే మన బతుకులు అగం అయుతాయని  దొంగ మెుక్కులు మెక్కుతూ దొంగ మాటాలు చెబుతున్న కాంగ్రెస్ పార్టీ మాటాలు నమ్మవద్దని మనకు మంచి చేసిన కేసీఆర్‌ కి అండగా ఉండాలని కారు గుర్తు కు ఓటు వేసి గెలిపించాలని మానకొండూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్  రసమయి బాలకిషన్  అన్నారు.శనివారం ఇల్లంతకుంట మండలంలోని జవారిపేట,గాలిపెల్లి,ఆరెపల్లె  గ్రామాలలోఎన్నికల ప్రచార కార్యక్రమం లో పాల్గొన్నారు ఈ సందర్భంగా  రసమయి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక  ముఖ్యమంత్రి కేసీఆర్  నిరుపేదల సంక్షేమం కోసం  అనేక పథకాలను రూపొందించి అమలు చేస్తూ.. పేదల పాలిట దేవుడిగా నిలిచారని ఆయన అన్నారు. ఎన్నికలు రాగానే దొంగ మెుక్కులు మెుక్కుతూ లేనిపోని వాగ్ధానాలు చేస్తూ ప్రజలను మోసం చేసే మాటలు చెబుతున్నా కాంగ్రెస్ పార్టీని నమ్మితే మన జీవితాల బుగ్గిపాలవుతాయని,తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చావు నోట్లో తల పెట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి  సంక్షేమ అభివృద్ధి లో దేశానికే ఆదర్శంగా మన రాష్ట్రాన్ని నిలిపిన  కెసిఆర్ కి బీఆర్ఎస్ పార్టీకిమద్దతుగా నిలవాలని ఆయన కోరారు. 55 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన మూలంగానే ప్రజలకు కష్టాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బిజెపి నాయకులు  ప్రజలను మోసం చేయడానికి  మభ్య పెట్టడానికి  ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆయా పార్టీల కుళ్లు కుతంత్రాలను ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.సీఎం కేసీఆర్  గొప్ప ఆలోచనలతోనే  రాష్ట్రంలోని అన్ని వర్గాలు  సంక్షేమ బాటలో ముందుకు సాగుతున్నాయని అన్నారు. నాపై నమ్మకంతో నన్ను గెలిపించిన నా మానకొండూర్ ప్రజానీకానికి ఋణపడి ఉంటానని మరో సారి నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే మరింత అభివృద్ది చేస్తానని అన్నారు. కాంగ్రెస్ పాలనలో  తెలంగాణ ప్రజలంతా అరిగోస పడ్డారని, వారి నమ్మితే గోసపడుతామని మోసపోతాం అని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతూ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని అందిస్తున్నాసీఎం కేసీఆర్ కి ప్రజలందరూ అండగా ఉండాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్  రూపొందించిన బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో సకల జనుల సంక్షేమయోగ్యంగా ఉందని,  అన్నారు. ఈ మేనిఫెస్టోలో గత పథకాల కొనసాగింపుతో పాటు, వాటికి మరింత ఆర్థిక లబ్ధిని చేకూర్చుతూ కొత్త పథకాలను ప్రవేశపెట్టారన్నారు. గత ప్రభుత్వాల హయాంలో రూ.200 ఉన్న 'ఆసరా పెన్షన్' ను కెసిఆర్  రూ.2,016కు పెంచడం జరిగిందని, తిరిగి అధికారంలోకి రాగానే దశల వారీగా రూ.5,016కు పెంచుతామని అన్నారు. అలాగే దివ్యాంగుల పెన్షన్ ఇటీవలే రూ.4,016కు పెంచడం జరిగిందని, నూతన ప్రభుత్వ హయాంలో 6 వేలకు పెంచుతామన్నారు. పంట పెట్టుబడి సాయం 'రైతు బంధు' ప్రవేశపెట్టింది కేసీఆర్ గారేనని ప్రస్తుతం 10వేల రూపాయలు ఉన్న రైతుబంధును దశలవారీగా 16 వేలకు పెంచుతామన్నారు. రాష్ట్రంలోని ఏ పేద కుటుంబం ఆకలికి అలమటించకూడదని, రేషన్ బియ్యంపై ఉన్న పరిమితిని ఎత్తివేసి ప్రతి వ్యక్తికి ఆరు కిలోల బియ్యాన్ని అందజేయడం జరుగుతోందని, రేషన్ షాపుల ద్వారా సరఫరా అవుతున్న బియ్యం తినడానికి ఇబ్బందికరంగా ఉందని కొన్ని వర్గాలనుంచి వస్తున్న విజ్ఞప్తి మేరకు 'అన్నపూర్ణ' పథకం ద్వారా రేషన్ కార్డుపై అందరికీ సన్న బియ్యం సరఫరా చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా పెంచిన గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం  వెయ్యి రూపాయలకు చేరుకుందని, పేద, మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని అర్హులైన కుటుంబాలకు 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను అందజేస్తామన్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన 93 లక్షల కుటుంబాలకు 'కేసీఆర్ బీమా-ప్రతి ఇంటికి ధీమా' పథకం కింద 5లక్షల రూపాయల ఉచిత భీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. అర్హులైన పేద కుటుంబాల మహిళలకు 'సౌభాగ్య లక్ష్మి' పథకం కింద నెలకు 3వేల రూపాయల జీవన భృతి అందజేస్తామన్నారు. సొంత ఇంటి జాగాలేని పేదలకు ఇండ్ల స్థలాలను సమకూరుస్తామన్నారు. 5లక్షల రూపాయలుగా ఉన్న ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని 'కెసిఆర్ ఆరోగ్య రక్ష' పేరుతో 15 లక్షలకు పెంచుతామన్నారు. అర్హులైన జర్నలిస్టులకు గ్యాస్ సిలిండర్, ఆరోగ్య రక్ష పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. నిర్ణయం తీసుకుంటుందన్నారు.

Post a Comment

0 Comments