JSON Variables

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు



శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు

• ఇల్లంతకుంట ఎస్ఐ డి.సుధాకర్

న్యూస్ పవర్ , 15 నవంబర్ , ఇల్లంతకుంట :
ఎన్నికల కోసం ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇల్లంతకుంట ఎస్ఐ డి.సుధాకర్ తెలిపారు. బుధవారం ఉదయం ఇల్లంతకుంట మండలంలోని అనంతారం, పెద్ద లింగపుర్, దాచరం, సిరికొండ, అనంతగిరి గ్రామాల్లో కేంద్ర బలగాలచే కవాతు మరియు ఇల్లంతకుంట మండల కేంద్రంలో మజీద్ చౌక్ మరియు వివేకానంద చౌక్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా దాచారం గ్రామంలో గ్రామస్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగవలసిన అవసరం ఉందని, ప్రతి పౌరుడు తన యొక్క ఓటును స్వేచ్ఛగా వినియోగించేలా చూడాలని, ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడినా,  అమాయక ప్రజలను బెదిరించినా చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. ప్రతి పౌరుడు స్వేచ్ఛగా తన ఓటు ను వినియోగించుకునేందుకు, ప్రశాంత వాతావరణo లో ఎన్నికలు జరిగేలా,  ప్రతి పౌరుడిలో ధైర్యం నింపేందుకు ఎన్నికల కమిషన్ కృషి చేస్తుందని ఆయన వివరించారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉందని, ఇతరుల ఎన్నికల ప్రచారాన్ని గాని కార్యక్రమాలను గాని ఎవరైనా ఆటంకపరిచినా,  అడ్డగించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలను పోస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్   భూమయ్య, కానిస్టేబుళ్లు, మధు, లక్ష్మినారాయణ, బాపు చందర్, క్రాంతి లు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments