JSON Variables

సిఇఐఆర్ సహాయంతో రెండు మొబైల్ ఫోన్ ల అప్పగింత


సిఇఐఆర్ సహాయంతో రెండు మొబైల్ ఫోన్ ల అప్పగింత


• ఆనందం వ్యక్తం చేసిన బాధితులు

న్యూస్ పవర్ , 15 నవంబర్ , ఇల్లంతకుంట :
సి.ఇ.ఐ.ఆర్ అప్లికేషన్ సహాయంతో పోగొట్టుకున్న రెండు మొబైల్ ఫోన్ లను పట్టుకొని బాధితులకు అప్పగించడం జరిగింది అని ఇల్లంతకుంట ఎస్ఐ డి.సుధాకర్ తెలిపారు. గతంలో వంతడ్పుల గ్రామానికి చెందిన గవ్వల.శ్రీనివాస్ S/o బీరయ్య తన 15,000/- విలువ గల ఒప్పో  ఏ-57 మొబైల్ ఫోన్ పోయిందని, మరియు వల్లంపట్ల పంచాయతీ సెక్రటరీ బి.శ్రీనివాస్  తన 15,000/- విలువ గల ఒప్పో మొబైల్ ఫోన్ పోయిందని ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ కు రాగా వారి మొబైల్ ఫోన్ ల వివరాలను సి.ఇ.ఐ.ఆర్ అప్లికేషన్ లో నమోదు చేయగా అట్టి ఫోన్ లలో వేరే వ్యక్తులు సిమ్ కార్డు లు వేయడంతో పోలీస్ స్టేషన్ కు అలెర్ట్ మెసేజ్ రావడం తో అట్టి మొబైల్ ఫోన్ ను 13-11-2023 రోజున గుర్తించి వాటిని ఈరోజు బాధితులకు అప్పగించడం జరిగింది అని, దీనితో మొబైల్ ఫోన్ పోయిన వ్యక్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారని అయన తెలిపారు. ఈ మొబైల్ ఫోన్ నీ గుర్తించడం లో కృషి చేసిన ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ సిబ్బంది అనిల్, మధు, లక్ష్మినారాయణ లను ఎస్సై డి సుధాకర్ అభినందించారు. మండలంలో ఎవరివైన మొబైల్ ఫోన్లు పోయినట్లయితే వెంటనే ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయాలని అయన తెలిపారు.

Post a Comment

0 Comments