JSON Variables

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
 న్యూస్ పవర్ , 14 నవంబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని కేరళ మోడల్ హై స్కూల్ లో భారతదేశ మొట్టమొదటి ప్రధాని నెహ్రూ జయంతిని పురస్కరించుకుని విద్యార్థులు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. అనంతరం పాఠశాల అడ్మిస్ట్రేటర్ కృష్ణ కుమార్ మాట్లాడుతూ బాలల దినోత్సవ వేడుకలు కొనియాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు వారికి ఆటవిడుపుగా ఉండి ఉత్సాహాన్ని కలిగించటం తో పాటు భావితరాలను మంచి పౌరులుగా తీర్చిదిద్దుతుందని ఆశాభావం వ్యక్తపరుస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరినీ అభినందించారు. తదనంతరం అంతర్జాతీయ వైజ్ఞానిక దినోత్సవం సందర్భంగా గత శుక్రవారం ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన అంతరిక్ష నమూనాలు,మానవ శరీర నిర్మాణం, జీర్ణవ్యవస్థ, పర్యావరణ రక్షణ లతో పాటు పలు నమూనాలు ఆకట్టుకోగా, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ ఎం నరేష్ రెడ్డి, ఉపాధ్యాయులు బాలకృష్ణ, రాజీ, బిజూ, బిన్సీ, ఘానీ, శృతి, ఏబీన్, రాజేందర్, రేణుక, లలిత, లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments